hike in charges
-
వాళ్లకి షాకిచ్చిన అమెజాన్..! భారీగా పెరిగిన ప్రైమ్ మెంబర్షిప్ ధరలు..!
ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రైమ్ మెంబర్షిప్ ధరలను పెంచుతూ అమెజాన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెరిగిన ధరలు అమెరికాకు చెందిన యూజర్లకు మాత్రమే వర్తించనున్నాయి. భారీగా పెరిగిన ధరలు..! అమెరికాలోని ప్రైమ్ యూజర్లకు షాకిస్తూ సబ్స్క్రిప్షన్ ధరలను అమెజాన్ భారీగా పెంచింది. అమెజాన్ తన వార్షిక యూఎస్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ల ధరను 17 శాతం పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే ధరల పెంపు షిప్పింగ్ కోసం అధిక ఖర్చులు, ఉద్యోగుల జీతాలు భారీగా పెరగడంతో కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ ధరలను సవరించాల్సి వచ్చిందని పేర్కొంది. దీంతో కొత్త అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ నెలవారీ సేవలు 14.99 డాలర్లకు, వార్షిక ప్లాన్ సబ్ప్క్రిప్షన్ 139 డాలర్లకు పెరిగాయి. కలిసోచ్చిన క్లౌడ్, యాడ్ వ్యాపారం..! అమెజాన్‌కు క్లౌడ్, యాడ్ బిజినెస్ కాసులను కురిపిచింది. క్లౌడ్ బిజినెస్ అమెజాన్ వెబ్ సర్వీస్ గణనీయమైన ఆదరణను పొందింది. ఊహించిన దాని కంటే మెరుగ్గా ఏడబ్ల్యూఎస్ సేవలు పనిచేశాయి. నిర్వహణ అంతరాయాలు, ఉత్పాదకత పడిపోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ 4 బిలియన్ల ఖర్చులకు దోహదపడ్డాయని అమెజాన్ ప్రతినిధి ఒల్సావ్స్కీ చెప్పారు. ఈ త్రైమాసికంలో కార్మిక-సంబంధిత సవాళ్లు కొనసాగుతాయని, 2022లో మౌలిక సదుపాయాలపై కంపెనీ మూలధన వ్యయం పెరుగుతుందని ఆయన విశ్లేషకులకు తెలిపారు. చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..! ఆ సేవలపై ఏకంగా రూ. 1000కి పైగా..! -
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు హెచ్చరిక..!
Amazon Prime Membership Price in India to Be Hiked From December: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు హెచ్చరిక..! ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ రేట్లను సుమారు 50 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా అమెజాన్ పెంచిన ధరలు వచ్చే నెల డిసెంబర్ 13 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో నెలసరి, త్రైమాసిక, వార్షిక ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్స్ భారీగా పెరగనున్నాయి. ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఉచిత డెలివరీలను, ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ సర్వీస్‌లను అందిస్తోంది. చదవండి: అపర కుబేరుడి పెద్దమనసు.. భారీగా సొమ్ము దానం, వాళ్ల నోళ్లకు పుల్‌స్టాప్ ముందుగా చేస్తే తగ్గనున్న మోత..! ప్రైమ్ మెంబర్షిప్ సేవలు వచ్చే నెల నుంచి భారీగా పెరగడంతో యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. ఛార్జీల మోత నుంచి తప్పించుకోవడం కోసం డిసెంబర్ 13 కంటే ముందుగానే ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్‌ను తీసుకుంటే యూజర్లకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా అమెజాన్ ఇప్పటికే ‘లాస్ట్ ఛాన్స్ టూ జాయిన్ ప్రైమ్’ పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొత్త ధరలు ఇలా ఉన్నాయి.. డిసెంబర్ 13 నుంచి మారనున్న ప్రైమ్ మెంబర్షిప్ ధరలు ఇలా ఉన్నాయి. నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ.129 ఉండగా అది కాస్తా రూ.179కి పెరగనుంది. మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ధర రూ.329 ఉండగా రూ.359కి పెరగనుంది. వార్షిక సబ్ స్క్రిప్షన్ ధర రూ. 999 ఉండగా అది కాస్త రూ.1,499కి పెరగనుంది. చదవండి: క్వాలిటీ లేని వస్తువులెలా అమ్ముతారు? అమెజాన్, ఫ్లిప్‌కార్టులకు నోటీసులు -
సబ్సిడియేతర ఎల్పిజి సిలిండర్ ధర భారీగా పెంపు
-
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జి
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఫీజులు తగ్గించాలన్న డిమాండ్‌తో జేఎన్‌యూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. పార్లమెంటు భవనం వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు సఫ్దర్‌గంజ్ సమాధి వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమీపంలో ఉన్న మూడు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. నెల్సన్ మండేలా మార్గ్, అరబిందోమార్గ్, బాబా గంగానాథ్ మార్గ్‌లలో పలు ఆంక్షలు విధించారు. విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, పోలీసుల తీరుపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థుల చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఎమర్జెన్సీ ఇన్ జేఎన్‌యూ’పేరుతో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. జేఎన్‌యూలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ కమిటీలో యూజీసీ మాజీ చైర్మన్ వీఎస్ చౌహాన్, ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధ, యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీకి యూజీసీ సహకారం అందించనుంది. -
ఆర్టీసీలో నష్టాల పరంపర
సెప్టెంబర్‌లో రూ.69 కోట్లు ఈ ఏడాది మొత్తం రూ.234 కోట్లు చార్జీల పెంపు కోసం సర్కారుపై ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణం పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయే దిశగా సాగుతోంది. వేతన సవరణ రూపంలో పడ్డ భారంతో ఇప్పటికే కునారిల్లిన సంస్థ తాజాగా రికార్డుస్థాయి నష్టాల తో కోలుకోలేని స్థితికి చేరుకుంటోంది. ఆగస్టు నెలలో రూ.68 కోట్ల నష్టాలతో ఉలిక్కిపడ్డ ఆర్టీసీకి సెప్టెంబర్ నెల నష్టాలు దిమ్మతిరిగేలా చేశాయి. రూ.69.12 కోట్లు నష్టాలు వచ్చినట్టు తాజాగా లెక్క తేల్చారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి నష్టాల మొత్తం రూ.214.10 కోట్లుగా ఉండగా ఈ సంవత్సరం అది రూ.234.50 కోట్లుగా నమోదైంది. వెరసి గత ఏడాది కంటే నష్టాలు ఎక్కువగా ఉండబోతున్నట్లు దాదాపు తేలిపోయింది. హైదరాబాద్ సిటీ జోన్లో నష్టాలు రూ.32 కోట్లను మించిపోయాయి. కరీంనగర్ జోన్ పరిధిలో రూ.20 కోట్లు, హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.17 కోట్లు నష్టాలు నమోదయ్యాయి. ఇలా తీవ్ర నష్టాలు, అప్పులకుప్పల నేపథ్యంలో కొత్తగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావట్లేదు. చార్జీల పెంపు తప్పదా? వేతన సవరణ సమయంలో అంతర్గత సామర్థ్యం పెంచుకుని ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. కానీ ఇప్పటికిప్పుడు ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో అర్థం కాక అధికారులు హైరానా పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా సాయమంటూ లేదు. రెండు నెలలుగా రూ.75 కోట్లు చొప్పున అందజేసిన మొత్తంతో జీతాలు చెల్లించేశారు. బస్ పాస్ మొత్తం రీయింబర్స్మెంట్ రూపంలో గతంలో వచ్చినట్టుగా ప్రభుత్వం నుంచి ఈ మొత్తం వచ్చింది. అంతేగానీ అదనంగా వచ్చిన సాయమంటూ లేదు. ఈ స్థితిలో బస్సు చార్జీల పెంపు ఒక్కటే మార్గమని ఆర్టీసీ భావిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వానికి నివేదించగా, జీహెచ్ఎంసీ ఎన్నికల భయంతో ప్రభుత్వం ఆ సాహసం చేయలేదు. మరోసారి ఒత్తిడి చేసే యోచనలో అధికారులున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా చార్జీల పెంపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తోంది. అక్కడ సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కూడా మార్గం సుగమమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అప్పు కోసం డిపోలను తనఖా పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.