ప్రయాణికుల పడిగాపులు
- పుష్కరాలను తరలిన ఆర్టీసీ బస్సులు
హిందూపురం అర్బన్ : స్థానిక ఆర్టీసీ డిపో నుంచి బస్సులు కృష్ణా పుష్కరాలకు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీకెండ్, పంద్రాగస్టు సెలవులు ముగించుకుని మంగళవారం హిందూపురం నుంచి బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రజలు బయలుదేరారు. అయితే బస్టాండులో సక్రమంగా బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది.
జిల్లా నుంచి సుమారు 90 బస్సులు పైగా కృష్ణా పుష్కరాలకు తరలించారు. అందులో హిందూపురం డిపో నుంచి 16 బస్సులు పంపించారు. అదేవిధంగా ప్రతి డిపో నుంచి వందల మందిగా ఆఫీస్, మెకానిక్, డ్రైవర్, కండక్టర్లను తీసుకెళ్లారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.