శునకాలకు పెళ్లి
వేలూరు: ప్రేమికుల దినాన్ని వ్యతిరేకిస్తూ వేలూరులో మంగళవారం ఉదయం హిందూ మహాసభ ఆధ్వర్యం లో శున కాలకు వివాహం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 14వ తేదీన ప్రేమికుల రోజుగా జరుపుకుంటా రు. అదే విధంగా ఆ రోజున ప్రేమికులిద్దరూ కలుసుకొని ఒకొరికొరు బహుమతులు అందజేసుకుంటారు. హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రేమికుల రోజును జరుపుకోరాదని తెలుపుతూ, ఆడ, మగ శునకాలను ప్రధాన తపాలా కార్యాలయం ఎదుటకు తీసుకొచ్చి శునకాలకు మాలలు వేసి పెళ్లి చేశారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు అని రాసి బోర్డు తరహాలో శునకాల మెడకు తగిలించారు.
హిందూ మహా సభ కార్యకర్తలు ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ ఈనెల 14న వేలూరు కోటై మైదానం, చిన్న పిల్లల పార్కు, అమృద్ధి పార్కులో హిందూ మహా సభ ఆధ్వర్యంలో ప్రేమ జంటలకు తాళికట్టు కార్యక్రమం నిర్వహిం చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామోదరన్, రీజినల్ కార్యదర్శి విజయకుమార్, జిల్లా అధ్యక్షులు శరవణన్, కార్యదర్శి మురుగన్ కార్యకర్తలు పాల్గొన్నారు.