'భారత్ మాతాకి జై అన్నవాళ్లే మన సోదరులు'
కరీంనగర్: భారత్ మాతాకి జై అన్నవాళ్లే మన సోదరులు' అని వీహెచ్‌పీ (విశ్వహిందూ పరిషత్) జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్లో తొగాడియ విలేకరులతోమాట్లాడారు. రాబోయో రోజుల్లో హిందూ దేశంలో హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల సంక్షేమానికి హైదరాబాద్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
అదేవిధంగా అయోధ్యలో రామమందిర్ నిర్మించి తీరుతామని తొగాడియా స్పష్టం చేశారు. మందిర్ నిర్మాణం వ్యతిరేకించే పార్టీలకు గుణపాఠం తప్పదని విమర్శించారు. రామనవమి రోజున లక్ష మందితో రామమందిర్ సంకల్ప ఉత్సవం నిర్వహిస్తామని ప్రవీణ్ తొగాడియా వెల్లడించారు.