breaking news
Hindi Bigg Boss
-
నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండగా మా అమ్మకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి?
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో సెలబ్రిటీలు అడుగుపెట్టినప్పుడు వారి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ లాగుతుంటారు. కొన్నిసార్లు వాళ్లే గతాన్ని గుర్తు చేసుకుని పక్కవారితో చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునిక సదానంద్ అదే పని చేసింది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొంది. నాకింకా పెళ్లి కాలేఈమె కెరీర్ తొలినాళ్లలో సింగర్ కుమార్ సానును ప్రేమించింది. ఈ విషయాన్ని ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో వెల్లడించింది. నేను సింగర్ (కుమార్ సాను)ని ప్రేమించాను. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. అతడు భార్యతో విడిపోయి ఉంటున్నాడు. దీంతో మేమిద్దరం కలిసుండేవాళ్లం. తనను ఎంతగానో నమ్మాను. కానీ ఓరోజు తనకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసింది. తప్పేంటి?ఆ విషయం అతడే ఒప్పుకోవడంతో తనకు బ్రేకప్ చెప్పాను అంది. తల్లికి యుక్తవయసులో ఉన్న రిలేషన్షిప్ గురించి కునిక కుమారుడు అయాన్ లాల్ స్పందిస్తూ.. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అమ్మకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? అప్పుడు తన వయసు 27 ఏళ్లే కదా! అప్పుడు నేనింకా పుట్టనేలేదు. కానీ, అమ్మ ప్రేమ విషయం నాకు తర్వాత తెలిసింది. 27 ఏళ్ల వయసులో లవ్అమ్మ అతడిని (కుమార్ సాను) సింగర్‌గా ఇష్టపడేది. ఇంట్లో అతడి పాటలు పాడుతూ ఉండేది. ఇప్పటికీ పాడుతుంది కూడా! అతడి ప్రతిభను ఇష్టపడుతుంది, కానీ ఆ వ్యక్తిని కాదు. వాళ్ల ప్రేమాయణం 27 ఏళ్లు సాగిందని అందరూ అనుకుంటారు, అది నిజం కాదు! అమ్మ 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమలో పడిందంతే! కొన్నేళ్లకే విడిపోయారు అని చెప్పుకొచ్చాడు.రెండు పెళ్లిళ్లు- విడాకులుకునికకు రెండు పెళ్లిళ్లయ్యాయి. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కొడుకు పుట్టాడు. తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఓ కుమారుడు సంతానం. కానీ ఈ జంట కూడా ఎంతోకాలం కలిసుండలేదు, భేదాభిప్రాయాల వల్ల విడాకులు తీసుకున్నారు.చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్‌గా రాము రాథోడ్ -
నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగత్తెను: బిగ్‌బాస్ బ్యూటీ
నేను ఐశ్వర్య రాయ్ కంటే అందగత్తెను అంటోంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్‌బాస్ బ్యూటీ తాన్య మిట్టల్ (Tanya Mittal). తాన్య ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొంది. ఈ షో కోసం ఏకంగా 800 చీరలు, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ పట్టుకెళ్లింది. పూటకో చీర మారుస్తానని, దానికి మ్యాచింగ్ కోసం కిలోల కొద్ది నగల్ని బిగ్‌బాస్ హౌస్‌కు పట్టుకెళ్లింది. అక్కడకు వెళ్లాక.. తనకు ఫ్రిజ్ డోర్ తీయడం రాదని, తలస్నానం చేయడం రాదంటూ షోలో ఒకటే ఓవరాక్షన్ చేస్తోంది.అవన్నీ నావల్ల కాదుఈ క్రమంలో ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో తాన్య.. నాకు చాలా వింత కోరికలున్నాయి. సుష్మితా సేన్ గెలిచిన మిస్ యూనివర్స్ కిరీటాన్ని నాకు బహుకరించినట్లు కలగన్నాను. పైగా నేను ఐశ్వర్యరాయ్ కంటే అందంగా ఉంటాను.. కానీ ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? సాయంత్రం ఆరు దాటిందంటే బయటకు వెళ్లకూడదు, ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడకూడదు, జీవితంలో వంట తప్ప ఏదీ నేర్చుకోకూడదు.. ఇలా నేను బతకలేను. అందంపైనే ఆసక్తి ఏర్పడింది. అందంగా కనిపించాలన్న కోరిక నాలో ఎక్కువవుతూ వచ్చింది అని చెప్పుకొచ్చింది. అలాగే తను 12వ తరగతివరకు మాత్రమే చదివినట్లు తాన్య పేర్కొంది.చదవండి: నేను క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది.. సారీ అమ్మా! -
మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి హెచ్చరిక
ప్రేమలో ఇన్వెస్ట్ చేస్తే ఏమీ మిగలదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే (Ranvir Shorey). చిన్నప్పటి నుంచి తనకు ప్రేమ కలిసిరావడం లేదని చెప్తున్నాడు. కానీ తాను బంబుల్ అనే ఓ డేటింగ్ యాప్‌లో ఉన్నట్లు తెలిపాడు. రణ్వీర్ ఇంకా మాట్లాడుతూ.. స్త్రీపురుషుల మధ్య దూరం పెరిగింది. మాజీ ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న భార్య.. కుటుంబసభ్యుల అండదండలతో భార్య ప్రాణాలు తీసిన భర్త.. ఇలాంటి వార్తలే తరచూ కనిపిస్తున్నాయి. ప్రేమలో ఇన్వెస్ట్?నాకైతే చిన్నప్పటినుంచి ఈ ప్రేమలు కలిసిరావడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ను బట్టి ప్రేమలో పడేందుకు ఇది సరైన సమయం కాదేమో అనిపిస్తోంది. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు డబ్బు పెట్టరు. ప్రేమ విషయంలోనూ అంతే.. ఇప్పుడు మార్కెట్ బాగోలేదు. కాబట్టి లవ్‌లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రోజులెలా ఉన్నాయంటే.. నా మాజీ ప్రియుడు కూడా నా కుటుంబ సభ్యుడే అని భార్య ఎదురుతిరిగి చెప్తోంది. మార్కెట్ బాగోలేదుఆమె అన్నదాంట్లో తప్పేముందని పదిమంది తనకు వత్తాసు పలుకుతున్నారు. దీన్నే డౌన్ మార్కెట్ అంటున్నాను. ఇలాంటి సమయంలో ప్రేమ జోలికి పోకుండా.. బుద్ధిగా ఇంట్లో ఉండి బాడీ బిల్డింగ్‌పై ఫోకస్ చేస్తే మీకే మంచిది అని సలహా ఇచ్చాడు. కాగా రణ్వీర్ షోరే.. గతంలో పూజా భట్‌ను ప్రేమించాడు. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి2010లో నటి కొంకణసేన్ శర్మను పెళ్లాడాడు. వీరికి కుమారుడు హరూన్ సంతానం. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2015లో విడిపోయారు. 2020లో విడాకులు తీసుకున్నారు. రణ్వీర్ చివరగా బిండియాకే బాహుబలి అనే సిరీస్‌లో కనిపించాడు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు.చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం -
800 చీరలు, 50 కిలోల జ్యువెలరీతో బిగ్‌బాస్‌లోకి.. ఎవరీ బ్యూటీ?
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు.. అక్కడేం చేయాలి? ఎలా సిద్ధంగా ఉండాలి? అవతలివారిని ఎలా ఢీకొట్టాలి? మానసికంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఒక్కరు మాత్రం అవన్నీ పక్కనపెట్టి ఎలా రెడీ అవాలి? తన రాయల్ లైఫ్‌ను ప్రజలకు ఎలా చూపించాలి? అన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఆవిడే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్ప్రెన్యూర్ తాన్య మిట్టల్ (Tanya Mittal).50 కిలోల నగలుఈమె ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొంది. ఈమె బిగ్‌బాస్ హౌస్‌కి ఏకంగా 800 చీరలు తీసుకెళ్లింది. అంతే కాదు, 50 కిలోల నగలను సైతం పట్టుకెళ్లిందట! ఇంత ఆర్భాటం ఎందుకన్న ప్రశ్నకు.. నా లగ్జరీలను నేనెందుకు వదిలేసుకోవాలి? నా చీరలు, నగలు అన్నీ నాతోపాటే తీసుకెళ్తా.. రోజుకు మూడు చీరలైనా కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను అని షోకి వెళ్లడానికి ముందే చెప్పింది. వెండి వస్తువులను కూడా వెంట తీసుకెళ్లింది. ఇలాంటి వీఐపీ ట్రీట్మెంట్ తాన్యకు మాత్రమే దక్కడం గమనార్హం!ఎవరీ తాన్య?మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 2000వ సంవత్సరంలో తాన్య మిట్టల్ జన్మించింది. 19 ఏళ్ల వయసులో కేవలం రూ.500తో 'హ్యాండ్‌మేడ్ లవ్ బై తాన్య' పేరిట హ్యాండ్‌బ్యాగ్, నగల బిజినెస్ ప్రారంభించింది. తర్వాత ఇందులో చీరలు అమ్మడం కూడా మొదలుపెట్టింది. 2018లో మిస్ ఆసియా టూరిజం యూనివర్స్ టైటిల్ గెలిచింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 మిలియన్ ఫాలోవర్లున్నారు. బిజినెస్, యాడ్స్ ద్వారా నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది. View this post on Instagram A post shared by Tanya Mittal (@tanyamittalofficial) చదవండి: మా ఇంట్లో ఎవరూ బీఫ్ తినరు: సల్మాన్ ఖాన్ తండ్రి -
పెళ్లయి 9 ఏళ్లు.. ఇంకా పిల్లలు వద్దంటోంది: నటుడు
హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ (Bigg Boss 19) ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 24న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ షోను లాంచ్ చేశాడు. 16 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. వారిలో బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) ఒకరు! తాజాగా ఓ ఎపిసోడ్లో యూట్యూబర్ మృదుల్ తివారీతో తన కుటుంబ విషయాలను చర్చించాడు. నా భార్య పేరు ఆకాంక్ష చమోలా (నటి).. ఈ ఏడాది నవంబర్ నాటికి మా వైవాహిక జీవితానికి 9 ఏళ్లు నిండుతాయి అని చెప్పాడు.పిల్లలంటే ఇష్టం.. భార్య వద్దంటోందిఎంతమంది పిల్లలు అని మృదుల్ అడగ్గా.. ఎవరూ లేరని బదులిచ్చాడు గౌరవ్. నా భార్య పిల్లలు వద్దంటోంది. కానీ, నాకేమో పిల్లలంటే చాలా ఇష్టం. మాది ప్రేమ వివాహం. కాబట్టి తనేం చెప్పినా నేను ఒప్పుకుని తీరాల్సిందే! ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివారి అభిప్రాయాలను మనం గౌరవించాల్సిందే! తను అన్నదాంట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే మాపై చాలా బాధ్యతలున్నాయి. నేను షూటింగ్స్ కోసం రోజంతా బయటే ఉండాల్సి వస్తుంది. తను కూడా షూటింగ్స్‌తో బిజీగా ఉంటుంది. ఎవరు చూసుకుంటారు?అలాంటప్పుడు ఇంట్లో పిల్లలుంటే వారిని ఎవరు చూసుకుంటారు? పిల్లల బాధ్యతను బయటవారికి అప్పజెప్పడం మాకిష్టం లేదు. ఓసారి నాకు పిల్లలు కావాల్సిందేనని తన దగ్గర పట్టుపట్టాను. అప్పుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడింది. ఆమె మాటలు విన్నాక తను చెప్పింది కూడా కరెక్టే అనిపించి చైల్డ్ ప్లానింగ్ వాయిదా వేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు.దాంపత్యానికి 9 ఏళ్లుగౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షోలో పాల్గొని టైటిల్ గెలిచాడు. ఆ షోలోనే ఆకాంక్షతో ఎలా ప్రేమలో పడ్డాడో చెప్పుకొచ్చాడు. ఓ ఆడిషన్లో ఆమెను తొలిసారి చూడగానే లవ్‌లో పడ్డానని, అలా అతడే ధైర్యం కూడదీసుకుని ఓ అడుగు ముందుకేసి ఆమెతో మాట కలిపానని తెలిపాడు. అలా తమ జర్నీ పెళ్లివరకు వచ్చిందన్నాడు. గౌరవ్- ఆకాంక్ష 2016లో పెళ్లి చేసుకున్నారు.చదవండి: పడ్డచోటే నిలబడ్డ కల్కి, కంటతడి పెట్టుకున్న జవాన్.. -
‘బిగ్‌బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే
బుల్లితెరపై ‘బిగ్‌బాస్’రియాల్టీ షోకి ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాకుండా అంతటా ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక హిందీలో అయితే ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా 19వ సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభం అయింది. మనుషుల ఎమోషన్‌తో సాగే ఈ షో.. కొంతమందికి జీవిత భాగస్వాములను కూడా వెతికిపెట్టింది. ఈ షోలో పాల్గొని, ప్రేమలో పడి..పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ‘బిగ్‌బాస్’కలిపిన జంటలపై ఓ లుక్కేద్దాం.సారా ఖాన్- అలీ మర్చంట్ బిగ్‌బాస్ షో ద్వారా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తొలి జంట సారా ఖాన్, అలీ మర్చంట్. హిందీ బిగ్‌బాస్ 4లో పాల్గొన్న వీరిద్దరు.. షోలో ఉన్నప్పుడే ప్రేమలో పడి వివాహం(2010లో) చేసుకున్నారు. అయితే, వీరి ప్రేమ కథ సుఖాంతం కాలేదు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్‌ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. కొన్నాళ్ల తర్వాత తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు.మోనాలిసా- విక్రాంత్ సింగ్ రాజ్పూత్భోజ్పురి హీరోయిన్ మోనాలిసా (అంతరా బిస్వాస్) బిగ్‌బాస్ 10లో పాల్గొన్నప్పుడు, ఆమె బాయ్‌ఫ్రెండ్ విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్ షోలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి, జాతీయ టెలివిజన్‌లో ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆ క్షణం అభిమానులకు ఎమోషనల్ మూమెంట్‌గా నిలిచింది. 2017లో వీరు బిగ్‌బాస్ హౌస్‌లోనే వివాహం చేసుకున్నారు, ఇది షో చరిత్రలో అరుదైన సంఘటన. తర్వాత వారు సాంప్రదాయ వివాహ వేడుకను కూడా జరుపుకున్నారు. వీరి బంధం ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది.యువికా చౌదరి-ప్రిన్స్ నరులాహిందీ బిగ్‌బాస్ 9లో పాల్గొన్న ప్రిన్స్ నరులా, యువికా చౌదరితో స్నేహంగా మొదలైన బంధం క్రమంగా ప్రేమగా మారింది. షోలో ప్రిన్స్ యువికా కోసం హార్ట్ ఆకారంలో చపాతీ చేసి ప్రపోజ్ చేసిన సన్నివేశం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కొందరు దీన్ని గేమ్ స్ట్రాటజీ అనుకున్నప్పటికీ, షో తర్వాత వీరి ప్రేమ నిజమని నిరూపితమైంది. 2018 అక్టోబర్ 12న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. యువికా ప్రిన్స్ కంటే ఏడేళ్లు పెద్దవారైనప్పటికీ, వారి బంధం అభిమానులకు స్ఫూర్తిగా నిలిచింది.సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్ బిగ్‌బాస్ 9లో పాల్గొన్నారు. వీరు 2011 నుంచి డేటింగ్లో ఉన్నప్పటికీ, షోలో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, షో ఒత్తిడిలో కూడా వారి బంధం బలపడింది. 2016లో వీరు సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. 2021లో వీరికి నిర్వైర్ అనే కుమారుడు జన్మించాడు.పాయల్ రోహత్గీ- సంగ్రామ్ సింగ్బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ, రెజ్లర్ సంగ్రామ్ సింగ్ బిగ్‌బాస్ 7లో కలుసుకున్నారు. వీరి సంబంధం షో తర్వాత కూడా కొనసాగింది, దాదాపు 12 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు.2022 జులై 9న ఆగ్రాలో వీరు వివాహం చేసుకున్నారు.