Hindi Crime Show
-
క్రైం సీరియల్ చూసి.. బాలిక కిడ్నాప్
సాక్షి,బెంగళూరు : ఓ హిందీ టీవీ చానెల్లో ప్రసారమయ్యే క్రైం ప్యాట్రోల్ సీరియల్ చూసి ఓ యువకుడు బాలికను అపహరించగా, గంట వ్యవధిలో పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు కాటన్‌పేటే పీఎస్ పరిధిలో జరిగింది. బసవనగుడి బుల్‌టెంపుల్ రోడ్డు చిరాగ్ ఆర్.మెహతా (21) పోలీసులకు పట్టుబడిన యువకుడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేథరిన్ స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న 4వ తరగతి బాలికను చిరాగ్ మెహతా అపహరించి బాడుగ స్కూటర్లో ఉడాయించాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తండ్రి హీరాలాల్ తక్షణం పోలీసులకు సమాచారం అందించాడు. కాటన్‌పేటే సీఐ టీసీ.వెంకటేశ్ ల్యావెల్లీ రోడ్డు వద్ద వెళుతున్న చిరాగ్ మెహతాను పట్టుకుని బాలికను కాపాడారు. బాలిక తండ్రి హీరాలాల్, కాటన్‌పేటె మెయిన్‌రోడ్డులో నివాసముంటూ చిక్కపేటేలో ఎలక్ట్రిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద డబ్బు గుంజాలని దుండగుడు ఈ పథకం వేశాడు. చిరాగ్ మెహతా తండ్రి రాకేశ్ పెండ్లిపత్రికల దుకాణం నిర్వహిస్తుండేవాడు. టీవీ సీరియల్లో చూసి బాలికను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. కేసు విచారణలో ఉంది. -
డైరీ రాయడం రావట్లేదు!
పాఠకులనైనా, ప్రేక్షకులనైనా అత్యంత ఆకర్షించే అంశాల్లో క్రైమ్ ముందుంటుంది. అందుకనే నేర సంబంధిత షోలు ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాయి. అవుతాయా? కచ్చితంగా అవుతాయి. కానీ తీయాల్సినట్టే తీస్తేనే. ఏ హిందీ చానెలైనా చూడండి... తప్పకుండా క్రైమ్ షో ఉంటుంది. సావధాన్ ఇండియా, క్రైమ్ పెట్రోల్, గుమ్రాహ్... ఇలా ఎన్నో. ఈ తరహాలోనే తెలుగులో మొదలైంది... పోలీస్ డైరీ. అయితే హిట్ మాత్రం కాలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. హిందీ క్రైమ్ షోస్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం... స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు మంచి నటీనటులు. కానీ పోలీస్ డైరీలో నటీనటులను చూస్తే అసలు వీళ్లకు నటన వచ్చా అనిపి స్తుంది. వాళ్ల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఎంత ఆర్టిఫీషియల్‌గా ఉంటాయంటే, చానెల్ మార్చే వరకూ మనశ్శాంతి ఉండదు ప్రేక్ష కుడికి. హిందీ షోలలో ఒక్కోసారి యాంకర్లుగా ప్రముఖ నటీనటులు కూడా కనిపిస్తుంటారు. ఇక్కడ మొదట్లో నాగబాబుతో మొదలెట్టినా, తర్వాత గ్లామర్ లేకుండా చేసేశారు. జనాన్ని చైతన్యవంతుల్ని చేస్తామని చెప్తూ... ఎంతసేపూ వివా హేతర సంబంధాలు, అమ్మాయిల ట్రాప్ వంటివే ఎక్కువగా చూపిస్తు న్నారు. కొన్ని సన్నివేశాల్ని కాస్త అతిగా చూపించడం కూడా జరుగుతోంది. ఈ మైనస్‌లన్నీ చూస్తే, డైరీ రాయడం రానట్టే అన్పిస్తోంది మరి!