బొగ్గు కుంభకోణం కేసులో నివేదిక సమర్పణ
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో హిందాల్కో పాత్రకు సంబంధించి సీబీఐ తన దర్యాప్తు నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. దర్యాప్తు ద్వారా సేకరించిన వాంగ్మూల్మాన్ని మంగళవారం కోర్టుకు అందజేసింది. ఈ నివేదిను సీల్డ్ కవర్ కోర్టుకు అప్పగించిన సీబీఐ.. దర్యాప్తు పూర్తయ్యే వరకూ నివేదికను బహిర్గతం చేయరాదని కోరింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 19వ తేదీన జరుగనుంది.