Hindu Rao Hospital
-
ఢిల్లీలో మూతపడిన పెద్దాసుపత్రి
సాక్షి, న్యూఢిల్లీ: ఓ నర్సుకు కరోనా రావడంతో ఢిల్లీలోని ఓ పెద్దాసుపత్రి మూతపడింది. ఉత్తర ఢిల్లీలోని హిందూరావు ఆసుపత్రిలో పనిచేసే నర్సుకు శనివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. గత రెండు వారాలుగా ఆమె హాస్పిటల్‌లోని వివిధ విభాగాల్లో పనిచేసింది. దీంతో అధికారులు ఆమెతో సన్నిహితంగా మెలిగినవారి వివరాలను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు ఆసుపత్రిని పూర్తిగా సానిటైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అప్పటివరకు సదరు ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా వుండగా ఢిల్లీలో ఇప్పటివరకు 2,625 కరోనా కేసులు నమోదవగా 869 మంది కోలుకున్నారు. 54 మంది మరణించారు. మరణాల రేటు తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్లాస్మా థెరపీని పరీక్షిస్తుండగా అది మంచి ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రాష్ట్రంలో 92కు పైగా కరోనా హాట్‌స్పాట్ జోన్లను ఏర్పాటు చేశారు. (సరికొత్త యాంటీబాడీ పరీక్ష సిద్ధం) -
పోలీసు వ్యాన్‌లో ప్రసవించిన మహిళ
న్యూఢిల్లీ: ఆసుపత్రికి తరలిస్తున్న ప్రసూతి మహిళ పోలీసు పీసీఆర్ వ్యాన్ లోనే ప్రసవించిన సంఘటన ఆదివారం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. గ్వాలియర్ నుంచి పానిపట్ లోని సమాల్కాకు రైల్లో ప్రయాణిస్తున్న 29 ఏళ్ల ఆర్తికీ అప్పటికప్పుడు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమెతో పాటు ఉన్న కుటుంబసభ్యులు సబ్జీ మండీ రైల్వే స్టేషన్ లో దించి సాయం కోసం ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆసుపత్రికి తరలించడానికి పీసీఆర్ వ్యాన్ ను స్టేషన్ కు పంపారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన పై స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పీసీఆర్ ఆమె ప్రస్తుతం హిందూ రావు ఆసుపత్రిలో ఉన్నట్లు తెలిపారు. పీసీఆర్ పోలీసులు చేస్తున్న మంచి పనులకు ఇదొక ఉదహరణని ఆయన అన్నారు. ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ పోలీసుల్లో పీసీఆర్ వ్యవస్థ క్రమంగా ఎదుగొతోందని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.