న్యూఢిల్లీ: ఆసుపత్రికి తరలిస్తున్న ప్రసూతి మహిళ పోలీసు పీసీఆర్ వ్యాన్ లోనే ప్రసవించిన సంఘటన ఆదివారం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. గ్వాలియర్ నుంచి పానిపట్ లోని సమాల్కాకు రైల్లో ప్రయాణిస్తున్న 29 ఏళ్ల ఆర్తికీ అప్పటికప్పుడు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమెతో పాటు ఉన్న కుటుంబసభ్యులు సబ్జీ మండీ రైల్వే స్టేషన్ లో దించి సాయం కోసం ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేశారు.
వెంటనే స్పందించిన పోలీసులు ఆసుపత్రికి తరలించడానికి పీసీఆర్ వ్యాన్ ను స్టేషన్ కు పంపారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన పై స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పీసీఆర్ ఆమె ప్రస్తుతం హిందూ రావు ఆసుపత్రిలో ఉన్నట్లు తెలిపారు. పీసీఆర్ పోలీసులు చేస్తున్న మంచి పనులకు ఇదొక ఉదహరణని ఆయన అన్నారు. ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ పోలీసుల్లో పీసీఆర్ వ్యవస్థ క్రమంగా ఎదుగొతోందని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
పోలీసు వ్యాన్లో ప్రసవించిన మహిళ
Published Mon, May 30 2016 10:09 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement