సాక్షి, న్యూఢిల్లీ: ఓ నర్సుకు కరోనా రావడంతో ఢిల్లీలోని ఓ పెద్దాసుపత్రి మూతపడింది. ఉత్తర ఢిల్లీలోని హిందూరావు ఆసుపత్రిలో పనిచేసే నర్సుకు శనివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. గత రెండు వారాలుగా ఆమె హాస్పిటల్‌లోని వివిధ విభాగాల్లో పనిచేసింది. దీంతో అధికారులు ఆమెతో సన్నిహితంగా మెలిగినవారి వివరాలను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు ఆసుపత్రిని పూర్తిగా సానిటైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అప్పటివరకు సదరు ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా వుండగా ఢిల్లీలో ఇప్పటివరకు 2,625 కరోనా కేసులు నమోదవగా 869 మంది కోలుకున్నారు. 54 మంది మరణించారు. మరణాల రేటు తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్లాస్మా థెరపీని పరీక్షిస్తుండగా అది మంచి ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రాష్ట్రంలో 92కు పైగా కరోనా హాట్‌స్పాట్ జోన్లను ఏర్పాటు చేశారు. (సరికొత్త యాంటీబాడీ పరీక్ష సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment