'జనాభా తగ్గడం హిందూ అస్తిత్వానికే ప్రమాదకరం'
తిరుమల: దేశంలో హిందువుల జనాభా తగ్గడం వారి అస్తిత్వానికే ప్రమాదకరమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. దేశంలో చట్టం అందరికీ ఒకే విధంగా ఉండకపోవడం వల్లే ముస్లింల జనాభా పెరిగిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
హిందువులకు చెందిన ప్రతీ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉండేలా చైతన్యం కలిగిస్తామని చెప్పారు. మతమార్పిడులకు అవకాశం లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఎస్ దుశ్చర్యలను ఎదుర్కొనేందుకు అన్ని మతాలు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.