Hindu temple broken
-
పాక్‌లో దేవాలయంపై దాడి కేసు.. 50 మంది అరెస్ట్
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో హిందూ దేవాలయంపై దాడి ఘటనలో ప్రధాన నిందితులు సహా 50 మందిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో 150 మందిపై కేసులు నమోదు చేశారు. ఆలయాన్ని కాపాడటంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందంటూ పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. యార్ఖాన్ జిల్లా భొంగ్ నగరంలోని ఓ స్కూలు ఆవరణలో మూత్ర విసర్జన చేశాడంటూ అరెస్టు చేసిన 8 హిందూ బాలుడిని పోలీసులు విడుదల చేసినందుకు నిరసనగా కొందరు స్థానిక దేవాలయాన్ని బుధవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును విచారించిన పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం పోలీసుల తీరుపై మండిపడింది. ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించే పనులు మొదలయ్యాయని పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ తెలిపారు. ఆలయాలపై దాడులు జరక్కుండా చూస్తామని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
అమెరికాలోని హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు
అట్లాంటా, జార్జియా : అమెరికాలోని హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు అక్కడున్న ప్రవాస తెలుగువారిని కలవర పెడుతున్నాయి. మే 17న కమ్మింగ్‌లో శ్రీ మహాలక్ష్మి ఆలయం, అట్లాంటాలోని రివర్‌డేల్‌లోని ఆలయంలో 18న చోరీలు జరిగాయి. ఈ రెండు దేవాలయాల్లో ఒకే గ్యాంగ్ చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూజారుల కళ్లుగప్పి విగ్రహాలకు అలంకరించిన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. మొత్తం ఆరుగురు ఈ చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు మహిళలున్నారు. హిందూ మతం ఆచార వ్యవహారాల గురించి పూజారిని అడుగి దృష్టి మరల్చగా, మిగతా వారు చోరీకి పాల్పడినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. -
దేవాలయంలో విగ్రహంపై దాడి: నిందితులు పరారీ
భక్తుల రూపంలో ఆలయంలో ప్రవేశించడమే కాకుండా అపై ప్రార్థన చేస్తున్నట్లు నటిస్తూ మూల విరాట్ హనుమంతుని విగ్రహనికి నిప్పంటించిన సంఘటన పాకిస్థాన్ దక్షిణ సింధ్ ప్రావెన్స్ ప్రాంతంలోని లతీఫాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....ముసుగు ధరించిన ముగ్గురు యువకులు హనుమంతుని ఆలయంలోకి ప్రవేశించారు. రామభక్తుడిని ప్రార్థన చేస్తున్నట్లు నటిస్తూ... ఒక్కసారిగావారితో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆ విగ్రహంపై పోసి నిప్పు అంటించారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీసి తమకు సహాయం చేయండి అంటూ బిగ్గరగా అరుస్తూ పరుగులు తీశారు. దేవాలయంలో హఠాత్తుగా చోటు చేసుకున్న ఆ పరిణామానికి స్థానికులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే వారు జనంలో కలసిపోయారు. దేవాలయంలో దాడి వార్త తెలిసిన వెంటనే స్థానిక హిందువులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తు నిరసనలు తెలిపారు.పోలీసులు దేవాలయానికి చేరుకుని జరిగిన సంఘటన విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించారని పోలీసుల అధికారులను ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్థానికంగా మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 14న ఆ హనుమంతుడి దేవాలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు.మరో రెండు వారాలలో వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల స్థానిక హిందువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాడి ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.