హిందూపురం ఎంఈఓ అరెస్టు
హిందూపురం అర్బన్ : హిందూపురం ఎంఈఓ గంగప్పను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ఎస్ఐలు బాషా, శ్రీధర్ తెలిపారు. ఇదే మండలం మిట్టమీదపల్లిలో పదో తరగతి పాసైన ఓ విద్యార్థినితో ఈ నెల 15న అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న ఎంఈఓను ఎట్టకేలకు అరెస్టు చేశామన్నారు. పెనుకొండ కోర్టులో హాజరుపరచనున్నట్లు వివరించారు.