hindupuram municipality
-
బాలకృష్ణ రిసార్ట్ రాజకీయం..
క్యాంపు రాజకీయాలతో ఎన్టీఆర్ నుంచి టీడీపీని చంద్రబాబు లాక్కోగా... అదే బాటలో ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నడుస్తున్నారు. 38 కౌన్సిల్ స్థానాలున్న హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను తమవైపునకు తిప్పుకుని రిసార్ట్ రాజకీయం చేస్తున్నారు.హిందూపురం: నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే ఎమ్మెల్యే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే హిందూపురం మున్సిపల్ పీఠంపై ఆయన కన్నేశారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు కుట్ర రాజకీయాలకు తెరలేపారు.ప్రలోభాలు.. బెదిరింపులుహిందూపురం మున్సిపాల్టీలో 38 వార్డులున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 30 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. బీజేపీ ఒకటి, ఎంఐఎం మరో స్థానం దక్కించుకోగా... టీడీపీ అష్టకష్టాలు పడి ఆరింటితో సరిపెట్టుకుంది. పురంలో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించాక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ స్థానం కోసం ఎంతోమంది పోటీపడగా..మహిళకు పెద్దపీట వేశారు. అందులోనూ బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావించి తొలిసారి కౌన్సిలర్‌గా గెలిచిన బోయ ఇంద్రజకు చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. బీసీ సంక్షేమంపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ గిమ్మిక్కు రాజకీయాలు చేశారు. ప్రలోభాలకు గురిచేసి ఇంద్రజను టీడీపీ వైపు లాగారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ చైర్పర్సన్ స్థానానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందుకు లొంగని వారిని భయపెట్టారు. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రస్తుతం హిందూపురం మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లను కలుపుకున్నారు. దీంతో టీడీపీ బలం 8కి చేరింది. దీంతో చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరికొంత మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమవైపు లాక్కున్నారు.రిసార్ట్ రాజకీయం..టీడీపీ, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లతో పాటు వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన కౌన్సిలర్లు, వారి కుటుంబీకులను ఎమ్మెల్యే బాలకృష్ణ హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించారు. రెండురోజుల్లో చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్ రాగానే కౌన్సిలర్లను నేరుగా కౌన్సిల్ సమావేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి చైర్మన్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ నీచ రాజకీయాన్ని జనం చీదరించుకుంటున్నారు. -
మునిసిపాలిటీలో టీడీపీ నేత హల్చల్
విభాగాల వారీగా తనిఖీలు అనధికార సమావేశంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి హిందూపురం మునిసిపాలిటీ: ఇంకా మునిసిపల్ కౌన్సిల్ ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా రాలేదు..ఎన్నికైన కౌన్సిలర్లు ఇంకా ప్రమాణస్వీకారం చేయనేలేదు..అయినా ఓ టీడీపీ నాయకుడు కాబోయే చైర్ పర్సన్ తన బార్యేనంటూ కార్యాలయంలో హల్ చల్ చేస్తున్నారు. గురువారం కార్యాలయంలోని ప్రతివిభాగాన్ని ఆయన పరిశీలించారు. ఏకంగా మునిసిపల్ కమిషనర్‌తో పాటు వివిధ విభాగాల అధికారులతో కౌన్సిల్ హాల్లోనే సమావేశాన్ని నిర్వహించి, ఆదేశాలను జారీ చేయడం పట్టణంలో హాట్ టాఫిక్‌గా మారింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలను ఏర్పాటు చేయడం సర్వసాధారణం. అయితే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఎమ్మెల్యే బాలకృష్ణ , కాబోయే మునిసిపల్ చైర్పర్సన్ ఫొటోలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించడం అధికారులను విస్మయపరచింది. చైర్ పర్సన్‌గా పదవీకాలం ముగిసిన తర్వాత ఫొటో పెట్టేందుకు అవకాశం వుంటుంది. అయితే చైర్పర్సన్ ఫొటోను కూడా ప్రతి విభాగంలో ఏర్పాటు చేయాలనడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పట్టణంలోని 38 వార్డుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యాక్రమాలను ముందుగానే వివరిస్తూ స్థానిక కౌన్సిలర్ ఫొటోతోపాటు, నలుగురి ఫొటోలను వెంటనే ఏర్పాటు చేయాలనడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. -
సీఎం పదవిపై ఆలోచిస్తా
హిందూపురం మునిసిపాలిటీ, న్యూస్‌లైన్ :తనకు అవకాశం వస్తే సీఎం పదవిపై ఆలోచిస్తానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన హిందూపురం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తే ముఖ్యమంత్రి పదవి విషయంపై ఆలోచిస్తానని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఎవరినీ బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇది పెళ్లో.. పేరంటమో కాదు కదా అని వ్యాఖ్యానించారు. ప్రజలు కావాలనుకుంటే ఆయన ప్రచారానికి రావొచ్చన్నారు. ఈ ప్రాంతం నుంచి తన తండ్రి ప్రాతినిధ్యం వహించారని, ఆయన ఆశయాల మేరకు ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని అన్నారు. వాటిని తాను పూర్తి చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన సమయంలోనే హిందూపురంలో బిందె రూ.2 ఉండేదని, తర్వాతి కాలంలో అది రూ.5కు చేరుకుందన్నారు. చంద్రబాబు హయాంలో నిజాం షుగర్స ఫ్యాక్టరీని మూసివేసి అమ్మేశారు కదా దీనిపై మీ స్పందన ఏమిటని విలేకరులు ప్రశ్నించారు. రైతులకు సాగునీటి కొరత ఏర్పడటంతోనే నిజాం షుగర్స ఫ్యాక్టరీని విక్రయించారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, మేనిఫెస్టోలోని అంశాల అమలుకు కృషి చేస్తామని చెప్పారు.