మళ్లీ అటకెక్కిన లావాసా ఐపీఓ
ముంబై: హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ(హెచ్సీసీ) లావాసా ప్రాజెక్ట్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ను అటకెక్కించింది. ఈ ఐపీఓను ఆపేయడం ఇది మూడోసారి. రియల్టీ రంగంలో మార్కెట్ పరిస్థితులు బాగా లేని కారణంగా లావాసా ప్రాజెక్ట్ ఐపీఓని ప్రస్తుతానికి పక్కన పెట్టామని హెచ్సీసీ పేర్కొంది. రియల్టీ రంగంలో పరిస్థితులు చక్కబడినప్పుడు ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబికి సమర్పిస్తామని హెచ్సీసీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ తెలిపారు.
రూ.2,000 కోట్ల సమీకరణకు గాను మొదటిసారిగా 2010, సెప్టెంబర్లో ఐపీఓకు రావడం కోసం సెబికి దరఖాస్తు చేసుకుంది. సెబి ఆమోదం పొంది కూడా మార్కెట్ ప్రతికూలంగా ఉండటంతో ఐపీఓను వాయిదా వేసింది.