Hiranyakashipa
-
జూన్ నుంచి రోలింగ్
పీరియాడికల్ చిత్రాలు, ప్యాన్ ఇండియా చిత్రాలపై రానా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్న సంగతి ఆయన సినిమాల ఎంపిక విషయాన్ని చూసి గమనించవచ్చు. ‘హాధీమేరీ సాథీ, 1945’ వంటి బహుబాషా చిత్రాలతోప్రస్తుతం బిజీగా ఉన్నారు రానా. ఇది వరకే అంగీకరించిన ‘హిరణ్యకశిప’ చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సుమారు 180 కోట్ల బడ్జెట్‌తో సురేశ్‌బాబు నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. ఈ చిత్ర వీఎఫ్ఎక్స్కు సుమారు 17 వీఎఫ్ఎక్స్ స్టూడియోలు పని చేయనున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
రాక్షస రాజుగా రానానే ఫిక్స్
రుద్రమదేవి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు గుణశేఖర్, ఈ సారి పౌరాణిక కథ మీద వర్క్ చేస్తున్నారు. మహా భక్తుడు ప్రహ్లాదుడి కథను హిరణ్య కశిపుడి కోణంలో రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజా ఈ సినిమాపై సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. గుణశేఖర్, రానా కాంబినేషన్లో హిరణ్య చిత్రం రూపొందుతుందని వెల్లడించారు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్ వర్క్ జరుగుతుందని చెప్పిన సురేష్, సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళుతుందన్న విషయం ఇప్పుడు చెప్పలేమన్నారు.