హోండా సిటీలో కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: జపాన్ కంపెనీ హోండా... అంతా కొత్తదైన హోండా సిటీ కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా సిటీ బ్రాండ్ కింద ఈ ఫోర్త్ జనరేషన్ మోడల్లో డీజిల్ వేరియంట్‌ను కూడా అందిస్తున్నామని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈవో హిరోనోరి కనయమ తెలిపారు. జపాన్‌లోని తొచిగిలో ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్లో ఈ హోండా కార్లను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. భారత్‌తో సహా ఇతర ఆసియా దేశాల్లో సర్వేలు నిర్వహించి వీటిని రూపొందించామన్నారు. తొలి తరం హోండా సిటీ కారును ఈ కంపెనీ 1998లో భారత్‌లోకి తెచ్చింది. ఇప్పటి వరకూ 4.3 లక్షల కార్లను విక్రయించింది.
ఇవీ కొత్త హోండా వివరాలు:
ధర: రూ.8.62-11.1 లక్షలు
డీజిల్(5 వేరియంట్లు- ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)
మైలేజీ: 26 కిలోమీటర్లు
పెట్రోల్ వెర్షన్ రూ.7.42 - 10.98 లక్షలు
మైలేజీ: 18 కిలోమీటర్లు
ఇతర ప్రత్యేకతలు: టచ్ స్క్రీన్ ఆటో ఏసీ, 5 అంగుళాల ఎల్సీడీ మానిటర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ పార్కింగ్ కెమెరా, స్టార్ట్/స్టాప్ బటన్, సన్‌రూఫ్, సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్.