hit and run cases
-
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ అప్డేట్
-
కారు దొంగతనాన్ని అడ్డుకోబోయాడు, పాపం.. ప్రాణం పోగొట్టుకున్నాడు!
కారు దొంగతనం అడ్డగించేందుకు చేసే ప్రయత్నంలో ఓ డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో మార్చి 8న రాత్రి 8 గంటల సమయంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన రాకేశ్ పటేల్ (33) అనే వైద్యుడు దుర్మరణం పాలయ్యాడు. వాష్టింగ్టన్ డీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు రాకేశ్ పటేల్. దుర్ఘటన జరిగిన రోజు నగరంలో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఆమెకు కొన్ని వస్తువులు అందించి వెనక్కి తిరగ్గా.. తన కారులో మరెవరవో ఉన్నట్టు రాకేశ్ గుర్తించాడు. వెంటనే కారు వైపుకు నడిచాడు. రాకేశ్ రావడం గమనించిన కారులోని అగాంతకుడు... కారుతో వేగంగా రాకేశ్‌ని ఢీ కొట్టాడు. ఆ తర్వాత అతని శరీరంపై నుంచి కారుని పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనలో దుండగుడు రాకేశ్‌కి చెందిన మెర్సిడెజ్ బెంజ్ కారుని దొంగలించడంతో పాటు అతని ప్రాణాలు బలిగొన్నాడు. ఈ దుర్ఘటనకు కారణమైన నిందితుడిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని వాష్టింగ్టన్ పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఓహియోలో ఉన్న రాకేశ్ తల్లిదండ్రులు వాషింగ్టన్‌కి పయణమయ్యారు. కళ్లెదుటే జరిగిన దారుణం చూసిన రాకేశ్ పటేల్ గర్ల్‌ఫ్రెండ్ ఇంకా షాక్‌లోనే ఉంది. -
హిట్ అండ్ రన్ కేసులో కొత్త నిబంధనలు.. నష్ట పరిహారం ఇలా
Hit and Run Motor Accidents Scheme 2022: రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టానికి కేంద్రం సరికొత్త సవరణలు చేసింది. రోడ్డు మీద నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారికి ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించేలా మార్పులు చేసింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి హిట్ అండ్ రన్ కేసులో నష్ట పరిహారాలను భారీగా పెంచింది. పాత చట్టంలో ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి 1989 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో బాధితులు తీవ్రంగా గాయపడితే నష్టపరిహారంగా రూ. 12,500 మరణిస్తే రూ. 25,000 ఇవ్వాలని ఉంది. దీంతో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి లీగల్ సెటిల్మెంట్లో ఈ చట్టమే అమలవుతోంది నాలుగింతలు పాత చట్టంలో నష్టపరిహారం చాలా చాలా తక్కువగా ఉండటంతో కేంద్రంర సవరణలకు సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు రూపొందించింది. హిట్ అండ్ రన్ కేసులో తీవ్రంగా గాయపడిన బాధితులకు నష్టపరిహారంగా రూ.50,000 చెల్లించాలని అదే విధంగా మరణం సంభవించినట్టయితే ఈ మొత్తాన్ని రూ. 2 లక్షలకు పెంచుతున్న 2022 ఫిబ్రవరి 25న కేంద్రం నోటిఫై చేసింది. ఈ నిర్ణయం 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రోడ్డు ప్రమాదాల తీరు ప్రభుత్వం దగ్గరున్న లేటెస్ట్ వివరాల ప్రకారం 2020 ఏడాదిలో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,31,714 మంది చనిపోయారు. లాక్డౌన్ కాలంలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు ఇలా ఉంటే సాధారణ సమయంలో వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంకా పెంచాలి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంప్, రాంగ్‌సైడ్ వంటి ఉద్దేశ పూర్వక తప్పుల ద్వారా జరుగుతున్న ప్రమాదాలు.. మరణాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ తరహా కేసులకు నష్టపరిహారం మరింత భారీగా ఉండేలా మార్పులు చేస్తే బాగుండెదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం చట్ట ప్రకారం చెల్లిస్తున్న పరిహారం తక్కువంటున్నారు. -
హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం రూ.2లక్షలు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో (గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మరణం) బాధిత కుటుంబాలకు పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. ప్రస్తుతం పరిహారం కింద కేవలం రూ.25,000 అందజేస్తున్నారు. ఒకవేళ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైతే బాధితులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా పథకాన్ని ఆగస్టు 2న నోటిఫై చేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి ప్రస్తుతం రూ.12,500 చొప్పున పరిహారం ఇస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2019లో దేశంలో 4,49,002 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 1,51,113 మంది ఈ ప్రమాదాల్లో మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు పరిహారం ఇవ్వడానికి, క్షతగాత్రులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం ‘మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ ఫండ్’ ఏర్పాటు చేయనుంది. -
‘ట్రాఫిక్’కు రవాణా శాఖ అండ..
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రణాళిక రాష్ట్ర రవాణా శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ అమలు సాక్షి, ముంబై: నగరంలో నియమనిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ముంబై ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ అమలుచేయనున్నారు. ప్రస్తుతం నగరంలో రిజిస్టర్ అయిన వాహనాల వివరాలను రవాణా శాఖనుంచి సేకరించనున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిని త్వరగా పట్టుకునేందుకు ఆస్కారముంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. నగరంలో నానాటికీ ‘హిట్ అండ్ రన్’ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా నగర కొత్త జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) బి.కె. ఉపాధ్యాయ మాట్లాడారు. సంయుక్త కార్యాచరణపై రవాణా శాఖతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. అన్ని వాహనాలకు సంబంధించి డేటా బేస్‌ను తమతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరామన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో నిబంధనలు ఉల్లఘించి పారిపోయిన వారిని త్వరితగతిన పట్టుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. నియమాలు పాటించని వాహనాలను పట్టుకునేందుకు ముందుగా తాము రీజినల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం (ఆర్టీవో)ను ఆశ్రయించి తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను తీసుకుంటామన్నారు. అంతేకాకుండా వాహన యజమాని చిరునామా తదితర వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియకే కనీసం రెండు రోజుల సమయం పడుతోందని తెలిపారు. కాగా, ఒకోసారి వీరు సేకరించిన చిరునామా స్పష్టంగా లేకపోవడంతో పోలీసులకు వీరిని ఛేదించడంలో చాలా సమయం వృథా అవుతోంది. కాగా, ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, చాలా మంది సిబ్బంది రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారని ట్రాఫిక్ అధికారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలను నిలిపేందుకు యత్నించినా వారు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను గాయపర్చి పారిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపేవారు ఇలా మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నార’ని అన్నారు. అయితే వీరెవరనేది ఛేదించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. నేరానికి పాల్పడిన వాహనాన్ని, దాని యజమానిని గుర్తించడం చాలా కష్టతరంగా మారుతోంది. దీంతో రాష్ట్ర రవాణా శాఖ తమకు వాహన వివరాలను అందజేయడం ద్వారా మార్గం సుగమం అవుతుందని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.