న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో (గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మరణం) బాధిత కుటుంబాలకు పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. ప్రస్తుతం పరిహారం కింద కేవలం రూ.25,000 అందజేస్తున్నారు. ఒకవేళ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైతే బాధితులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ప్రతిపాదించింది.
ఈ మేరకు ముసాయిదా పథకాన్ని ఆగస్టు 2న నోటిఫై చేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి ప్రస్తుతం రూ.12,500 చొప్పున పరిహారం ఇస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2019లో దేశంలో 4,49,002 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 1,51,113 మంది ఈ ప్రమాదాల్లో మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు పరిహారం ఇవ్వడానికి, క్షతగాత్రులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం ‘మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ ఫండ్’ ఏర్పాటు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment