దుబాయ్ వెళ్లే విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దుబాయ్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమాన ప్రమాదం పలు విమానాల రద్దుకు దారి తీసింది. మరికొన్నింటిని షార్జా, అబుదాభి విమానాశ్రయాల ద్వారా దారి మళ్లించాల్సి వచ్చింది. కేవలం పెద్ద విమానాలకు మాత్రమే దుబాయ్ ఎయిర్ పోర్ట్ అనుమతిస్తోంది. ఈ ఆటంకాలకు శనివారం ఉదయానికి తెరపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యలో భారత విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు.
గురువారం ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు కాన్సిల్ అయినట్టు తెలిపారు. ముఖ్యంగా వైడ్ బాడీ విమానాలకు మాత్రమే శుక్రవారం వరకూ అనుమతి ఉందని, ఎయిర్ ఇండియా జెట్ ఎయిర్ వేస్ కు మాత్రమే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇటు ఇండియా నుంచి దుబాయ్ మీదుగా వెళ్లే పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రముఖ విమానయాన సంస్థలు కూడా ప్రకటించాయి.
ఢిల్లీ నుంచి దుబాయ్ కు వెళ్లే విమానాలను రీషెడ్యూల్ చేసినట్టు జెట్ ఎయిర్వేస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వరుస ట్విట్లతో ప్రయాణికులకు అప్ డేట్ చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యంకోసం సాధ్యంమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పైస్ జెట్ ట్వీట్ చేసింది. అల్ మక్ టం అంతర్జాతీయ విమానాశ్రయం, రాస్ అల్ ఖైమాహ్, షార్జా మళ్లిస్తూ, తమ ప్రయాణీకులకు దుబాయ్ నగరం చేరుకోవడానికి వీలుగా ఈ విమానాశ్రయాల నుంచి ప్రయాణ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని స్పైస జెట్ తెలిపింది.
ఇండిగో గురువారం పలు విమానాలనురద్దు చేసినట్టు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు ఒక ప్రకనటలో తెలిపింది. దుబాయ్ ఎయిర్ పోర్టులో రన్ వే అందుబాటులో లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ప్రయాణికుల ఏర్పాట్లకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని ప్రకటించాయి. శుక్రవారం ఉదయం 7.30 వరకు ఉన్న విమానాలు అందుబాటులో వుండవని ఇండిగో తెలిపింది. ఆదివారం లిమిటెడ్ గా తమ సర్వీసులను నడుపుతామని తెలిపింది. ఇండిగో ప్యాసింజర్లు దీన్ని గమనించాలని కోరింది. ప్రయాణీకులు తమ తమ విమాన స్థితిని తనిఖీచేసుకోవాలని అభ్యర్థించింది.
కాగా ఎమిరేట్స్ బుధవారం 27 విమానాలను రద్దు చేసింది. మిగిలినవాటిని దారి మళ్లించింది. అనుకోని సంఘటనతో దాదాపు 23 వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు బుధవారం, అంతకుముందు బుక్ చేసుకున్న టికెట్లు ఎలాంటి చార్జ్ లేకుండా క్యాన్సిల్ చేసుకోవచ్చని తెలిపాయి. 21.5 లక్షలమంది ప్రయాణికులతో ముంబై దుబాయ్ మధ్య అత్యంత రద్దీ గా ఉండే అంతర్జాతీయ మార్గంగా ఖ్యాతి గడించింది. దీనితర్వాత 17 లక్షలమందితో ఢిల్లీ-దుబాయ్ మార్గం రెండవ స్థానంలో నిలిచింది.
Dubai- only widebody aircraft allwd till 7 AM tom. AI routing thru Sharjah, Jet thru Sharjah&Abudhabi & Indigo,Spicejet cncld today.
— Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) August 4, 2016
(1/3) #TravelUpdate: Some of our flights to & from #Dubai are affected due to single runway operations at Dubai airport and contd…
— Jet Airways (@jetairways) August 4, 2016