HMIL
-
మార్కెట్లోకి హ్యుందాయ్ ‘గ్రాండ్ ఐ10 నియోస్’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్).. తాజాగా తన కాంపాక్ట్ సెగ్మెంట్ పోర్ట్ ఫోలియోలో ‘గ్రాండ్ ఐ10 నియోస్’ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.4.99 లక్షలు (ఎక్స్‌షోరూం) కాగా, హైఎండ్ కారు ధర రూ.7.14 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.4.99 లక్షలుగానూ, టాప్ఎండ్ ధర రూ.7.99 లక్షలుగా నిర్ణయించింది. నూతన వేరియంట్లలో 1.2 డీజిల్, పెట్రోల్ ఇంజిన్లను అమర్చింది. మోడల్ ఆధారంగా ప్రతి లీటరుకు 20.7 నుంచి 26.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నట్లు వివరించింది. ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్ ఎండీ, సీఈఓ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ.. ‘నూతన మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో మేడిన్ ఇండియా ఉత్పత్తిగా లభిస్తుంది. భారత్‌లో అమ్ముడయ్యే ప్యాసింజర్ వాహనాల్లో (కాంపాక్ట్ విభాగం) 50 శాతానికి మించి వాటాను ఐ10 కలిగి ఉంది. వచ్చే ఐదేళ్లలో కూడా ఈ మోడల్‌దే హవాగా కొనసాగనుంది. నియోస్ విడుదలతో 19.4 శాతంగా ఉన్న ప్రస్తుత కంపెనీ మార్కెట్ వాటా మరింత పెరగనుందని భావిస్తున్నాం’ అని అన్నారు. జీఎస్టీ తగ్గితేపరిశ్రమ గాడినపడుతుంది వాహనాలపై వస్తు సేవల పన్ను రేట్లను ప్రభుత్వం తగ్గిస్తే ఆటో పరిశ్రమకు ఇది సానుకూల అంశంగా మారుతుందని హెచ్ఎంఐఎల్ ఎండీ, సీఈఓ ఎస్ఎస్ కిమ్ అన్నారు. అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న పరిశ్రమకు జీఎస్టీ తగ్గింపు ఊతమిస్తుంది. రానున్నది పండుగల సీజన్ కావడం చేత ఈ సమయంలోనే ప్రభుత్వం రేట్లను తగ్గించడం అనేది సరైన నిర్ణయంగా ఉంటుందని విశ్లేషించారు. పండుగల సమయంలో కొనుగోళ్లు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రేట్ల కోతకు ఇదే మంచి సమయమని చెప్పారాయన. ప్రభుత్వ నిర్ణయమే ఇప్పుడు పరిశ్రమను గాడిలో పడేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘వాహన రుణాలకు రుణ లభ్యత తగ్గిపోవడం, బీఎస్–6 అమలు, పెరిగిన బీమా ధరలు, వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతినడం వంటి ప్రతికూలతల్లో పరిశ్రమ ఇబ్బందుల్లో పడిపోయింది. అయితే, త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని భావిస్తున్నా. ఇందుకు తగిన నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10.. స్పోర్ట్స్ ఎడిషన్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 మోడల్లో స్పోర్ట్స్ ఎడిషన్, గ్రాండ్ స్పోర్ట్స్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. గ్రాండ్ ఐ10ను మార్కెట్లోకి తెచ్చి ఏడాదైన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ గ్రాండ్ స్పోర్ట్జ్ కారును రెండు వేరియంట్లు-యూ2 1.1 లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్(ధర రూ.5.98 లక్షలు), 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్లలో(ధర రూ.5.11 లక్షలు, రెండూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ ధరలు) అందిస్తున్నామన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్ ఐ10ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటి వరకూ 1.1 లక్షల వినియోగదారులకు విక్రయించామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్, బ్లూ టూత్ కనెక్టివిటి, స్టీరింగ్‌పై ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్, రియర్ స్పా యిలర్, బి-పిల్లర్ బ్లాకవుట్ వంటి ప్రత్యేకతలున్నాయన్నారు. డీజిల్ కారు 24 కి.మీ. మైలేజీని, పెట్రోల్ కారు 18.9 కి.మీ. మైలేజీని ఇస్తుందని తెలిపారు. -
మార్కెట్లోకి హ్యుందాయ్ ‘ఎలైట్ ఐ 20’
సాక్షి, న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ఐ20 మోడల్లో అంతా కొత్తదైన ఎలైట్ ఐ20 కారును సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరి యంట్లలో ఈ కారును అందిస్తున్నామని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఎండీ, బీఎస్ సియో చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.4.9 లక్షలు నుంచి రూ.6.46 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.6.09 లక్షల నుంచి రూ.7.67 లక్షల రేంజ్లో (ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కారును మొదటిసారి భారత్‌లోనే విడుదల చేశామని చెప్పారు. ఐ20 మోడల్‌ను 2008, డిసెం బర్లో మార్కెట్లోకి తెచ్చామని ఇప్పటిదాకా 7.34 లక్షలు విక్రయించామని పేర్కొన్నారు. ఈ కొత్త మోడల్లో ఎరా, మాగ్నా, స్పోట్జ్, స్పోట్జ్ (ఓ), ఆస్టా-5 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు మారుతీ సుజుకి స్విఫ్ట్, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. నెలకు 6000కు ఐ20 అమ్మకాలు గత ఏడాది మొత్తం 3.8 లక్షల కార్లను విక్రయించామని, ఈ ఏడాది 4.10 లక్షల కార్లను విక్రయించాలనేది లక్ష్యమని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఐ20 కార్లు నెలకు 3,800 చొప్పున అమ్ముడవుతున్నాయని, ఈ కొత్త వెర్షన్‌తో ఈ సంఖ్య 6,000కు చేరగలదని చెప్పారు.