Hockey Test series
-
ఆకాశ్‌దీప్ హ్యాట్రిక్ వృథా.. ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి
IND VS AUS Hockey Test Series: ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత పురుషుల జట్టు ఓటమితో ప్రారంభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–5 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత స్టార్ ప్లేయర్ ఆకాశ్‌దీప్ సింగ్ (10వ, 27వ, 59వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించినా ఫలితం లేకపోయింది. మరో గోల్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (31వ ని.లో) అందించాడు. ఆ్రస్టేలియా తరఫున లాచ్లాన్ షార్ప్ (5వ ని.లో), నాథన్ ఇఫారౌమ్స్ (21వ ని.లో), టామ్ క్రెయిగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... బ్లేక్ గోవర్స్ (57వ, 60వ ని.లో) రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
భారత్‌కు తొలి విజయం
జపాన్‌తో హాకీ సిరీస్ భువనేశ్వర్ : జపాన్‌తో జరుగుతున్న హాకీ టెస్టు సిరీస్‌లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నప్పటికీ... రెండో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 2-0 గోల్స్ తేడాతో నెగ్గింది. ఎస్కే ఉతప్ప, ధరమ్వీర్ సింగ్ భారత జట్టు తరఫున గోల్స్ చేశారు. తొలి క్వార్టర్ నుంచే ఇరు జట్లు దూకుడు కనబరచడంతో ఎవరి నుంచీ గోల్స్ నమోదు కాలేదు. రెండో క్వార్టర్లో పూర్తి రక్షణాత్మక ఆటతీరును కనబరిచారు. 29వ నిమిషంలో యువరాజ్ వాల్మీకి ఇచ్చిన పాస్‌ను వృథా చేయకుండా ఎస్కే ఉతప్ప గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో క్వార్టర్లో జపాన్‌పై ఆధిక్యం చూపిన భారత్ 48వ నిమిషంలో ధరమ్వీర్ సాధించిన గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. -
హాకీ జట్టుకు ఘన స్వాగతం
స్వదేశానికి చేరుకున్న సర్దార్ సింగ్ సేన న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై హాకీ టెస్టు సిరీస్ గెలిచి స్వదేశానికి చేరుకున్న భారత పురుషుల జట్టుకు హాకీ ఇండియా (హెచ్ఐ) మంగళవారం ఘనంగా స్వాగతం పలికింది. కొంత మంది అభిమానులు కూడా విమానాశ్రయానికి వచ్చి అభినందనలు తెలిపారు. సిరీస్ అంతటా తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. ‘200 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నాకు ఇంతకంటే పెద్ద బహుమతి ఉండదు. ఈ విజయాన్ని మర్చిపోలేను. చాంపియన్స్ ట్రోఫీలో రాణించడానికి ఇది స్ఫూర్తినిస్తుంది’ అని సర్దార్ పేర్కొన్నాడు. అద్భుతమైన విజయాన్ని సాధించిన టీమిండియాకు హెచ్ఐ సెక్రటరీ జనరల్ మహ్మద్ ముస్తాక్ అహ్మద్ అభినందనలు తెలిపారు. డిసెంబర్ 6 నుంచి 14 వరకు భువనేశ్వర్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. జర్మనీతో జరిగే తొలి మ్యాచ్‌తో సర్దార్‌సేన ఈ టోర్నీని ప్రారంభిస్తుంది. -
భారత్‌కు రెండో గెలుపు
మలేసియాతో హాకీ సిరీస్ కౌలాలంపూర్: మలేసియాతో జరుగుతున్న హాకీ టెస్టు సిరీస్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 2-0తో ఆతిథ్య మలేసియాను ఓడించింది. దీంతో ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. అనురాధ దేవి (10వ ని.), పూనమ్ రాణి (28వ ని.)లు భారత్ తరఫున గోల్స్ చేశారు. ప్రారంభం నుంచి మెరుగ్గా ఆడిన టీమిండియా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. రెండో అర్ధభాగంలో స్కోరును సమం చేసేందుకు మలేసియా చేసిన అటాకింగ్‌ను భారత గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకుంది. ఇరుజట్ల మధ్య మూడో మ్యాచ్ గురువారం జరగనుంది.