జపాన్‌తో హాకీ సిరీస్
భువనేశ్వర్ : జపాన్‌తో జరుగుతున్న హాకీ టెస్టు సిరీస్‌లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నప్పటికీ... రెండో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 2-0 గోల్స్ తేడాతో నెగ్గింది. ఎస్‌కే ఉతప్ప, ధరమ్‌వీర్ సింగ్ భారత జట్టు తరఫున గోల్స్ చేశారు. తొలి క్వార్టర్ నుంచే ఇరు జట్లు దూకుడు కనబరచడంతో ఎవరి నుంచీ గోల్స్ నమోదు కాలేదు.
రెండో క్వార్టర్‌లో పూర్తి రక్షణాత్మక ఆటతీరును కనబరిచారు. 29వ నిమిషంలో యువరాజ్ వాల్మీకి ఇచ్చిన పాస్‌ను వృథా చేయకుండా ఎస్‌కే ఉతప్ప గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో క్వార్టర్‌లో జపాన్‌పై ఆధిక్యం చూపిన భారత్ 48వ నిమిషంలో ధరమ్‌వీర్ సాధించిన గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది.
భారత్‌కు తొలి విజయం
Published Wed, May 6 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement