హాకీ జట్టుకు ఘన స్వాగతం | Grand Welcomo to Hockey team | Sakshi
Sakshi News home page

హాకీ జట్టుకు ఘన స్వాగతం

Published Wed, Nov 12 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

హాకీ జట్టుకు ఘన స్వాగతం

హాకీ జట్టుకు ఘన స్వాగతం

స్వదేశానికి చేరుకున్న సర్దార్ సింగ్ సేన
 
 న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై హాకీ టెస్టు సిరీస్ గెలిచి స్వదేశానికి చేరుకున్న భారత పురుషుల జట్టుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం ఘనంగా స్వాగతం పలికింది. కొంత మంది అభిమానులు కూడా విమానాశ్రయానికి వచ్చి అభినందనలు తెలిపారు. సిరీస్ అంతటా తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. ‘200 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నాకు ఇంతకంటే పెద్ద బహుమతి ఉండదు. ఈ విజయాన్ని మర్చిపోలేను.

చాంపియన్స్ ట్రోఫీలో రాణించడానికి ఇది స్ఫూర్తినిస్తుంది’ అని సర్దార్ పేర్కొన్నాడు. అద్భుతమైన విజయాన్ని సాధించిన టీమిండియాకు హెచ్‌ఐ సెక్రటరీ జనరల్ మహ్మద్ ముస్తాక్ అహ్మద్ అభినందనలు తెలిపారు. డిసెంబర్ 6 నుంచి 14 వరకు భువనేశ్వర్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. జర్మనీతో జరిగే తొలి మ్యాచ్‌తో సర్దార్‌సేన ఈ టోర్నీని ప్రారంభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement