hockey tourny
-
బాలికల హాకీ విజేత నెరిమెట్ల
- బాలుర విజేత తలుపూరు జట్టు - నేటి నుంచి జిల్లా స్థాయి హాకీ టోర్నీ అనంతపురం సప్తగిరిసర్కిల్ : అనంతపురం 9వ రీజియన్ హాకీ టోర్నీ బాలికల విజేతగా నెరిమెట్ల జెడ్పీ ఉన్నత పాఠశాల జట్టు నిలిచింది. రన్నరప్‌గా వెంకటాద్రిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల జట్టు నిలిచింది. స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం జరిగిన ఫైనల్ పోరులో నెరిమెట్ల, వెంకటాద్రిపల్లి జట్లు తలపడ్డాయి. ఉత్కంఠంగా సాగిన పోరులో ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 0–0 తో సమంగా నిలిచాయి. దీంతో నిర్వాహకులు ఇరు జట్లు టోర్నీలో చేసిన స్కోరును పరిగణలోకి తీసుకుని నెరిమెట్ల జట్టు టోర్నీలో మొత్తం 4 గోల్స్‌తో ఆధిక్యం ప్రదర్శించడంతో నెరిమెట్ల జట్టును టోర్నీ విన్నర్‌గా ప్రకటించారు. వెంకటాద్రిపల్లి జట్టు టోర్నీలో 1 గోల్‌తో వెనుకబడింది. దీంతో వెంకటాద్రిపల్లి జట్టు రన్నరప్‌గా ప్రకటించారు. బాలుర విన్నర్‌గా తలుపూరు జట్టు నిలిచింది. ఫైనల్ పోరులో తలుపూరు, వెంకటాద్రిపల్లి బాలుర ఉన్నత పాఠశాల జట్లు తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి స్కోరు చేయలేక పోయాయి. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను పది నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో ఇరు జట్లు వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోయాయి. దీంతో ఇరు జట్లు ఎలాంటి స్కోరు చేయకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు షూటవుట్‌ను నిర్వహించారు. షూటవుట్‌లో తలుపూరు జట్టు 2 గోల్స్ సాధించింది. జట్టులో చందు–1, మధు–1 గోల్ చేశారు. వెంకటాద్రిపల్లి జట్టు 1 గోల్(వేణు) మాత్రమే చేయగలిగింది. దీంతో తలుపూరు జట్టును విన్నర్‌గా ప్రకటించారు. బాలుర, బాలికల విభాగంలో వెంకటాద్రిపల్లి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. విన్నరప్, రన్నరప్‌గా నిలిచిన ఇరు జట్లు గురువారం అనంత క్రీడా మైదానంలో జరిగే జిల్లాస్థాయి హాకీ టోర్నీలో తలపడతాయని ఆర్డీటీ కోచ్ చౌడేశ్వరి ప్రసాద్ తెలిపారు. నైపుణ్యాలను పెంచేందుకు టోర్నీలు ఉపయోగపడతాయి : నెదర్లాండ్ కోచ్‌లు వెస్సీ, రాడ్రిక్లు క్రీడాకారుల్లో నైపుణ్యాలను పెంచేందుకు టోర్నీలు ఉపయోగపడతాయని నెదర్లాండ్ హాకీ కోచ్‌లు వెస్సీ, రాడ్రిక్లు అభిప్రాయపడ్డారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన అనంతపురం రీజియన్ హాకీ టోర్నీ బహుమతుల ప్రదానోత్సవానికి వారు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల ఆట తీరు ఆకట్టుకుందన్నారు. మెళుకువల ద్వారా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆటతీరు మరింత మెరుగు పడేందుకు జిల్లాలో ఆయా సెంటర్లలో తమ కోచింగ్ క్యాంపులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌బాబు, బాబయ్య, పీడీలు వెంకటనాయుడు, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ
- విజేతగా నెల్లూరు జట్టు - నాల్గోస్థానంలో ధర్మవరం ధర్మవరం టౌన్ : మూడు రోజులుగా ధర్మవరంలో హోరాహోరీగా సాఽగిన రాష్ట్రస్థాయి గోల్డెన్ జూబ్లీ ఫాదర్ ఫెర్రర్ మెమోరియల్ ఓపెన్ హాకీ టోర్నీ ఆదివారంతో ముగిసింది. విజేతగా నెల్లూరు జట్టు నిలిచింది. ద్వితీయ స్థానంలో వైజాగ్, తృతీయ స్థానంలో వైఎస్సార్ జిల్లా, నాల్గోస్థానంలో ధర్మవరం జట్లు నిలిచాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వైఎస్సార్ జిల్లా జట్టుపై 3–2 గోల్స్ తేడాతో వైజాగ్ జట్టు విజయం సాధించింది. అలాగే ధర్మవరం జట్టుపై నెల్లూరు 3–1 తేడాతో గెలిచింది. అనంతరం ధర్మవరం జట్టుతో మ్యాచ్‌లో వైఎస్సార్ జిల్లా స్పోర్ట్స్ స్కూల్ విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో వైజాగ్‌పై నెల్లూరు జట్టు 1-0 తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్ రాష్ట కార్యదర్శి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రథమ బహుమతిగా నెల్లూరు జట్టుకు రూ.20, ద్వితీయ బహుమతి కింద వైజాగ్ జట్టుకు రూ.10 వేలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన «వైఎస్సార్, ధర్మవరం జట్లకు రూ.5 వేలు చొప్పున నగదు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మాంబ అథ్లెటిక్ హకీ అసోసియేషన్ 75 ఏళ్లు పూర్తి చేసుకుని డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా హాకీ టోర్నీ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌బాబు, జాయింట్ సెక్రెటరీ వడ్డే బాలాజీ, ధర్మాంబ హాకీ అసోసియేషన్ సభ్యులు బీవీ శ్రీనివాసులు, పల్లెం వేణుగోపాల్, బండి వేణుగోపాల్, బందనాథం సూర్యప్రకాష్, అశ్వర్థనారాయణ, సీతారామయ్య, కౌన్సిలర్ ఉడుముల రాము, అన్నం శ్రీన, సీనియర్ క్రీడాకారులు జెన్నే చందు, అమ్ను, కోచ్ హస్సేన్ పాల్గొన్నారు. -
ఉత్కంఠగా రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ
ధర్మవరం టౌన్ : పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ధర్మాంబ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి డైమండ్ జూబ్లీ ఓపెన్ విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ హాకీ చాంపియన్‌షిప్ టోర్నీ శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగింది. టోర్నీ ప్రారంభంలో పుంగనూరు సీఐ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఉదయం నుంచి జరిగిన మ్యాచ్‌లలో తొలుత ఆర్డీటీ అనంతపురం జట్టు నెల్లూరు జట్టుతో తలపడగా నెల్లూరు జట్టు 4–3 తేడాతో విజయం సాధించింది. అనంతరం ధర్మవరం జట్టు విజయవాడ జట్టుతో తలపడగా ధర్మవరం జట్టు 4–1 తేడాతో గెలుపొందింది. చంద్రగిరి జట్టు వైజాగ్‌తో తలపడగా వైజాగ్ జట్టు 4–2తేడాతో జయకేతనం ఎగురవేసింది. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ జట్టు యలమంచిలి జట్టుతో తలపడగా వైఎస్సార్ జట్టు 3–0 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే అనంతపురం ఆర్డీటీ జట్టు నెల్లూరు జట్టుతో తలపడగా 1–1తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో శనివారం జరగనున్న సూపర్‌లీగ్ మ్యాచ్‌లకు ధర్మవరం, వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్, నెల్లూరు, వైజాగ్ జట్లు అర్హత సాధించాయి. కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు, ధర్మాంబ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు పల్లెం వేణుగోపాల్, బందనాథం సూర్యప్రకాష్, వడ్డే బాలాజీ, అశ్వర్థనారాయణ, సీనియర్ క్రీడాకారులు జెన్నే చందు, అమ్ను, మారుతీ, కోచ్ హస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో ‘అనంత’కు మూడో స్థానం
ధర్మవరం టౌన్ : కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా హాకీ టోర్నీలో అనంతజట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అనంత జట్టు వైఎస్సార్ జిల్లా జట్టుతో తలపడింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో 1–1తో సమం కావడంతో ఫెనాల్టీ స్ట్రోక్‌ను నిర్వహించారు. ఇందులో 5–4 గోల్స్ తేడాతో వైఎస్సార్ జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. అనంతరం టోర్నీలో మూడో స్థానం కోసం అనంత జట్టు వైజాగ్‌తో తలపడగా 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించి మూడో స్థానం దక్కించుకుంది. ప్రతిభ కనబరచిన అనంత జట్టు క్రీడాకారులను హకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాంచో ఫెర్రర్, జిల్లా జాయింట్ సెక్రటరీ వడ్డే బాలాజీ తదితరులు అభినందించారు. -
హాకీ ఫైనల్స్‌లో అనంత, వైఎస్సార్ జట్లు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 హాకీ టోర్నీ ఫైనల్స్‌లోకి అనంత, వైఎస్సార్ జిల్లా జట్లు దూసుకెళ్లాయి. ఆదివారం నగరంలోని ఆర్ట్స్‌కాలేజీ, బాలుర ఉన్నత పాఠశాల మైదానాల్లో జరిగిన సెమీఫైనల్ మ్యాచులు రసవత్తరంగా సాగాయి. అనంత బాలికల జట్టు.. పశ్చిమగోదావరి జట్టుపై 7–0తో విజయం సాధించింది. అనంత జట్టు లో జ్యోతి–4, మహేశ్వరి–2, వాణి–1 గోల్స్ చేసి జట్టును విజయ తీరానికి చేర్చారు. మరో సెమీఫైనల్ లో చిత్తూరు జట్టును వైఎస్సార్ జిల్లా జట్టు 1–0తో ఓడించింది. వైఎస్సార్ జిల్లా జట్టులోని సౌజన్య–1 గోల్ చేసింది. సోమవారం అనంత, వైఎస్సార్ జిల్లా జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఇక... బాలుర క్వార్టర్ ఫైనల్స్‌లో నెల్లూరును విశాఖపట్టణం జట్టు 3– 0తో ఓడించింది. విశాఖ జట్టులో అభిషేక్–2, హరీష్–1 గోల్స్ చేశారు. ఇక కృష్ణా, కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ మొదట టై కాగా... స్ట్రోక్స్‌లో 3–2 తేడాతో కర్నూలు జట్టు విజయం సాధించింది. కర్నూలు జట్టులో యువరాజు–1, హర్షవర్ధన్ రెడ్డి–1, సునీల్–1 గోల్స్ చేశారు. వైయస్సార్ జిల్లా జట్టును అనంత జట్టు 1–0తో ఓడించింది. అనంత జట్టులో భాస్కర్–1 గోల్ సాధించాడు. విజయనగరం జట్టును చిత్తూరు జట్టు 1–0తో ఓడించింది. చిత్తూరు జట్టు లోని సూరి–1 గోల్‌ను సాధించాడు. నేడు బాలికల ఫైనల్స్ బాలికల విభాగంలో అనంతపురం,వైయస్సార్ జిల్లా జట్లు సోమవారం తలపడనున్నాయి. అలాగే బాలుర సెమీఫైనల్స్‌లో విశాఖపట్టణం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జట్లు తలపడతాయి. -
నేటి నుంచి అండర్–19 హాకీ పోటీలు
– అనంత వేదికగా బాల,నేటి నుంచి అండర్–19 హాకీ పోటీలు – బాలికల రాష్ట్రస్థాయి టోర్నీ అనంతపురం సప్తగిరి సర్కిల్ : 62వ రాష్ట్రస్థాయి అండర్–19 హాకీ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని స్కూల్‌గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఆర్ట్స్ కళాశాల మైదానం, కొత్తూరు బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 17వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జాయింట్ కలెక్టర్–2 ఖాజామోహిద్దీన్, ఆర్జేడీ వెంకటరమణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ టోర్నీలో 11 జిల్లాల బాలుర, 6 జిల్లాల బాలికల జట్లు పాల్గొంటాయన్నారు.