ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ
- విజేతగా నెల్లూరు జట్టు
- నాల్గోస్థానంలో ధర్మవరం
ధర్మవరం టౌన్ : మూడు రోజులుగా ధర్మవరంలో హోరాహోరీగా సాఽగిన రాష్ట్రస్థాయి గోల్డెన్ జూబ్లీ ఫాదర్ ఫెర్రర్ మెమోరియల్ ఓపెన్ హాకీ టోర్నీ ఆదివారంతో ముగిసింది. విజేతగా నెల్లూరు జట్టు నిలిచింది. ద్వితీయ స్థానంలో వైజాగ్, తృతీయ స్థానంలో వైఎస్సార్ జిల్లా, నాల్గోస్థానంలో ధర్మవరం జట్లు నిలిచాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వైఎస్సార్ జిల్లా జట్టుపై 3–2 గోల్స్ తేడాతో వైజాగ్ జట్టు విజయం సాధించింది. అలాగే ధర్మవరం జట్టుపై నెల్లూరు 3–1 తేడాతో గెలిచింది.
అనంతరం ధర్మవరం జట్టుతో మ్యాచ్‌లో వైఎస్సార్ జిల్లా స్పోర్ట్స్ స్కూల్ విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో వైజాగ్‌పై నెల్లూరు జట్టు 1-0 తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్ రాష్ట కార్యదర్శి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రథమ బహుమతిగా నెల్లూరు జట్టుకు రూ.20, ద్వితీయ బహుమతి కింద వైజాగ్ జట్టుకు రూ.10 వేలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన «వైఎస్సార్, ధర్మవరం జట్లకు రూ.5 వేలు చొప్పున నగదు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మాంబ అథ్లెటిక్ హకీ అసోసియేషన్ 75 ఏళ్లు పూర్తి చేసుకుని డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా హాకీ టోర్నీ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌బాబు, జాయింట్ సెక్రెటరీ వడ్డే బాలాజీ, ధర్మాంబ హాకీ అసోసియేషన్ సభ్యులు బీవీ శ్రీనివాసులు, పల్లెం వేణుగోపాల్, బండి వేణుగోపాల్, బందనాథం సూర్యప్రకాష్, అశ్వర్థనారాయణ, సీతారామయ్య, కౌన్సిలర్ ఉడుముల రాము, అన్నం శ్రీన, సీనియర్ క్రీడాకారులు జెన్నే చందు, అమ్ను, కోచ్ హస్సేన్ పాల్గొన్నారు.