అడవిపంది దాడి: మహిళకు గాయాలు
లక్ష్మీనర్సుపేట: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట మండలం పెద్దకోట గ్రామంలో ఓ మహిళపై అడవి పంది దాడి చేసింది. గ్రామానికి చెందిన చింతాడ బుచ్చయ్య భార్య అప్పమ్మ(50) బుధవారం ఉదయం పొలానికి వెళ్తుండగా పొదల్లో నుంచి వచ్చి ఒక్కసారిగా అడవి పంది దాడి చేసింది. అప్పమ్మ పెద్దగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు చేరుకుని అడవి పంది తరిమికొట్టారు. పంది దాడిలో అప్పమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.