క్రికెట్ జెర్సీలలో మురిసిన నేతలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండో క్రికెట్ జెర్సీలఫొటో ఒకటి ట్విట్టర్లో ఆకర్షణగా నిలిచింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తన ట్టిట్టర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు.
నేతలిద్దరూ ఇండియా క్రికెట్ నెం.1, ఫ్రాన్స్ క్రికెట్ నెం.1 అని రాసి ఉన్న జెర్సీలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు భారత్ మరియు ఫ్రాన్స్ ఒకటి.. ఒకటి.. పదకొండు అంటూ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ జర్మనీ, కెనడాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.