కనగ.. కనగ.. కమనీయమూ..!
కోటప్పకొండపై సహస్ర ఘటాభిషేకం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారికి ఆదివారం సహస్ర ఘాటాభిషేకం నిర్వహించారు. వర్షాలు కురవాలని దేవాదాయ ధర్మధాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ సమితి సూచనల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వరుణ హోమం చేపట్టారు. వెయ్యి కుండలతో నీటిని తీసుకువచ్చి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.