Home Construction Sector
-
హైదరాబాద్‌లో రియల్టీ జోరు!
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లోని ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 12 శాతంగా ఉంది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నగరంలో 12,700 గృహాలు అమ్ముడుపోగా.. 13,900 యూనిట్లు సిద్ధం అయ్యాయి. క్యూ2తో పోలిస్తే విక్రయాలు 16 శాతం క్షీణించగా.. కొత్తగా సిద్ధమైనవి ఒక శాతం పెరిగాయని అనరాక్ తాజా అధ్యయనం వెల్లడించింది.గృహ విక్రయాల్లో పశ్చిమ హైదరాబాద్ హవా కొనసాగుతోంది. క్యూ3లో అమ్ముడైన ఇళ్లలో 53 శాతం వెస్ట్ జోన్లోనే జరిగాయి. ఆ తర్వాత నార్త్‌లో 28 శాతం, సౌత్‌లో 13 శాతం, ఈస్ట్‌లో 4 శాతం, సెంట్రల్ హైదరాబాద్‌లో ఒక శాతం విక్రయాలు జరిగాయి. నగరంలో అపార్ట్మెంట్ల చదరపు అడుగు ధర సగటున రూ.7,150లుగా ఉన్నాయి.లక్ష దాటిన ఇన్వెంటరీ..హైదరాబాద్‌లో తొలిసారిగా ఇన్వెంటరీ లక్ష యూనిట్లను దాటింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి నగరంలో 1.01 లక్షల గృహాల ఇన్వెంటరీ ఉంది. దేశంలోని ఇన్వెంటరీలో 18 శాతం నగరానిదే. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లో 60 శాతం, నార్త్‌లో 25 శాతం ఇన్వెంటరీ ఉంది.3–5 శాతం ధరల వృద్ధి..నగరంలో మూడు నెలల్లో గృహాల అద్దెలు 1–4 శాతం, అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు ధరలు 3–5 శాతం మేర పెరిగాయి. ఆదిభట్లలో చ.అ. ధర సగటు రూ.4,650, ఎల్బీనగర్లో రూ.6,800, మియాపూర్‌లో 6,700, కొండాపూర్‌లో రూ.8,600, గచ్చిబౌలీలో రూ.8,900లుగా ఉన్నాయి. ఇక అద్దెలు డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్‌లకు నెలకు ఆయా ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.42 వేలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!లగ్జరీ గృహాలే ఎక్కువ..నగరంలో క్యూ3లో 13,900 యూనిట్లు సిద్ధం కాగా.. లగ్జరీ గృహాలు అత్యధికంగా ఉన్నాయి. రూ.1.5 కోట్లకు పైగా ధర ఉన్న ప్రీమియం ఇళ్ల వాటా 60 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.40–80 లక్షల ధర ఉన్న గృహాల వాటా మూడు శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ఉన్న యూనిట్ల వాటా 37%, రూ.1.5–2.5 కోట్ల ధర ఉన్న ఇళ్ల వాటా 40%, రెండున్నర కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 20 శాతంగా ఉంది. -
ఖర్చు తక్కువ.. సమయం తక్కువ.. సౌకర్యాలు ఎక్కువ.. కంటైనర్ హోమ్స్
కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగ అనేక అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వర్క్ కల్చర్‌లో వర్క్ ఫ్రం హోం వచ్చి చేరింది. ఆన్లైన్ క్లాసులు కామన్‌గా మారాయి. అదే తరహాలో కంటైనర్ హోమ్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. సొంతింటి కల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా సొంతిళ్లు కలిగి ఉండాలనేది చాలా మంది కోరిక. అయితే కోవిడ్ సంక్షోభం తర్వాత మారిన పరస్థితిల్లో ఇంటి నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగింది. స్టీలు, సిమెంటు మొదలు అన్ని రకాలైన బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ పెరిగింది. ఇదే సమయంలో ఆదాయం, రాబడులు తగ్గిపోయాయి. దీంతో తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం ఎలా అంశంపై చాలా మంది దృష్టి సారించారు. రిఫ్రెష్మెంట్ కోసం ఇక వర్క్ ఫ్రం హోం కల్చర్‌తో చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఇతర హై ఎండ్ వైట్ కాలర్ జాబ్ ఉద్యోగులు బోర్డమ్ ఫీలవుతున్నారు. బయటి ప్రదేశాలకు వెళ్దామంటే కరోనా వేరియంట్లు, కోవిడ్ నిబంధనలు ఎప్పటికప్పుడు బంధనాలు వేస్తున్నాయి. దీంతో సొంతిరిలో సౌకర్యాల లేమి ఇబ్బందిగా మారింది. దీంతో అతి తక్కువ ఖర్చుతో సొంతూరు, లేదా తమ వ్యవసాయ క్షేత్రంలో ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారి సంఖ్య పెరిగింది. కంటైనర్ హోమ్స్ ఇలా తక్కువ ధరలో చక్కనైన ఇళ్లు కావాలనుకునే వారికి కంటైనర్ ఇళ్లలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. గతంలో భారీ ప్రాజెక్టులు చేపట్టే దగ్గర అక్కడ పని చేసే సిబ్బంది, కార్మికులు ఉండేందుకు వీలుగా కంటైనర్ ఆఫీసులు, ఇళ్లులు నిర్మించడం జరిగేది. కానీ ఇప్పుడు వ్యక్తిగత ఇల్ల నిర్మాణంలో సైతం కంటైనర్ హోమ్స్ దూసుకొస్తున్నాయి. ఖర్చు తక్కువ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు కూడా సరిపోవడం లేదు. అదే కంటైనర్ హోమ్ అయితే ఐదు లక్షల రేంజ్లో డబుల్ బెడ్ రూమ్ ఇంటినే సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలుంది. పైగా ఆర్డర్ చేసిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. పైగా హాల్, కిచెన్, బెడ్రూమ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. దీంతో తక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చే కంటైనర్ ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని రియల్టీ వర్గాలు అంటున్నాయి. డిమాండ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఢిల్లీ)తో పాటు ముంబై, మహారాష్ట్ర, కర్నాటక, హైదరాబాద్‌లలో కంటైనర్ హోమ్స్‌కి డిమాండ్ పెరిగిందని ఎకానామిక్టైమ్స్ కథనం ప్రచురించింది. గతంలో తమ కంపెనీకి నెలకు ఒకటి లేదా రెండు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్డర్లు వచ్చేవని కోవిడ్ తర్వాత ఈ సంఖ్య ఐదు నుంచి ఆరుకు చేరుకుందని తెలిపారు. చదవండి: హోమ్ గార్డెనింగ్ -
నాలుగేళ్ల నుంచి నిరాశే!
బడ్జెట్‌పై పెదవి విరిచిన నిర్మాణ రంగం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగేళ్ల నుంచి గృహ నిర్మాణ రంగానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ కీలక మంత్రుల్ని కలిసి తమ బాధల్ని నివేదించాం కూడా. గతంలో చిదంబర.. నేడు అరుణ్ జైటీ.. నిర్మాణ సంస్థల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఏదో తప్పదన్నట్టుగా అరకొర నిర్ణయాల్ని తీసుకున్నారే తప్ప.. నిజమైన అభివృద్ధికి ఊతమిచ్చే నిర్ణయాలు చేపట్టలేదు’’ అని పలువురు నిర్మాణ రంగం నిపుణులు చెప్పారు. తొలిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ నిర్మాణ రంగాన్ని నిరాశలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ఏవరేమన్నారంటే.. బంగారం అక్రమ రవాణాను విస్మరించారు జెమ్ అండ్ జువెల్లరీ, లగ్జరీ అండ్ లైఫ్‌స్టైల్ ఫోరం ఆఫ్ ఫిక్కి మిహుల్ చోక్క్సీ నగల తయారీ పరిశ్రమను ప్రోత్సహించేలా నిర్ణయాలను ఆశించాం. కానీ, ఈ బడ్జెట్లో దేశంలో నల్ల డబ్బును అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారే తప్ప దేశంలోకి వచ్చే బంగారు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2013లో 180 టన్నుల మేర బంగారం అక్రమంగా దేశంలోకి వచ్చింది. దీని విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. వీటి ద్వారా కస్టమ్స్ డ్యూటీ కింద ప్రభుత్వానికి రావాల్సిన బిలియన్ డాలర్లు అలాగే 2% దిగుమతి సుంకాన్ని కూడా నష్టపోయాం. జీడీపీలో 6-7% వాటా ఉన్న ఇండియన్ ఆభ రణాల పరిశ్రమను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోకపోవడం విచారకరం. కాసింత ఉపశమనం గేరా డెవలప్మెంట్ ఎండీ రోహిత్ గేరా నేరుగా స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ పరోక్షంగా కాసింత ఉపశమనాన్ని కలిగించింది. మౌలిక రంగానికి ఊతం ఇచ్చే జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి (ఎన్ఐఐఎఫ్) ఏర్పాటు చేయటం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో ఐఆర్ఎఫ్సీ, ఎన్‌హెచ్‌బీ వంటి మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిధుల కొరతతతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇన్ఫ్రా సంస్థలకు నిధులు లభిస్తాయి. స్మార్ట్ సిటీల ఊసేలేదు: నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ ఇప్పటికే తీవ్ర నిధుల కొరతలో కొట్టుమిట్టాడుతున్న స్థిరాస్తి రంగాన్ని ఈ బడ్జెట్ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. దేశంలో వంద స్మార్ట్‌సిటీల నిర్మాణం అని పదేపదే చెప్పిన ప్రభుత్వం అవి ఎక్కడ, ఎంత మేర నిధులు ఖర్చు చేస్తారనే విషయంలో స్పష్టత ఇస్తుందనుకుంటే ఆ విషయాన్నే ప్రస్తావించలేదు. ఎన్నారైలకు నిరాశే మిగిలింది హిందూజా గ్రూప్ గ్లోబల్ చైర్మన్ శ్రీచంద్ పీ హిందుజా దేశంలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారని ఆశించిన ఎన్నారైలకు మాత్రం ఈ బడ్జెట్ చేదు గులికల్ని మిగిల్చింది. నిర్ధిష్టమైన చర్యలు, నిజమైన అభివృద్ధికి బాటలు పరిచేలా నిర్ణయాలు లేకపోవడం శోచనీయం. ‘హౌజింగ్ ఫర్ ఆల్’ కష్టమే సీబీఆర్ఈ సౌత్ ఏసియా సీఎండీ అన్షుమన్ అందరి సొంతింటి కలను సాకారం చేసే నిర్మాణ రంగానికీ ఉన్న కలలను మాత్రం ఈ బడ్జెట్ తీర్చలేదు. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారనుకుంటే ఆ ఊసే ఎత్తలేదు. 2022 నాటికి దేశంలో 6 కోట్లు ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించని ఈ బడ్జెట్‌తో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవటం కష్టమే.