కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్
⇒ నియామకాలన్నీ మా తుది తీర్పునకు లోబడి ఉంటాయి
⇒ ఈ విషయాన్ని నియామకపు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనాలి
⇒ ప్రభుత్వం, రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నియామకాలన్నీ తుదితీర్పుకు లోబ డి ఉంటాయని స్పష్టం చేసింది. ఎంపికైన ప్రతి అభ్యర్థికీ నియామకపు ఉత్తర్వుల్లోనే ఈ విష యాన్ని స్పష్టంగా పేర్కొనాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. జనరల్ (ఓపెన్) కేటగి రీకి నిర్దేశించిన 80 శాతం కటాఫ్ కన్నా తక్కు వ మార్కులొచ్చిన 188 మంది హోంగా ర్డులకు ఓపెన్ కేటగిరీ కింద ఎలాంటి నియా మకపు ఉత్తర్వులూ ఇవ్వబోమన్న ప్రభుత్వ హామీని నమోదు చేసుకుంది. మొత్తం ప్రక్రి య పారదర్శకంగా ఉండేందుకు జిల్లావారీగా ఒక్కో అభ్యర్థి మార్కులు, ర్యాంకులు, రిజ ర్వేషన్ ఆధారంగా కటాఫ్ మార్కులను బహి ర్గతం చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది.
ఆ వివరాలంటినీ తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, బోర్డును ఆదేశించింది. ఈ వివరాల్లో, కౌంటర్లలో లోటుపాట్లు కనిపిస్తే తదుపరి విచారణ కన్నా ముందే ఎప్పుడైనా ప్రత్యేక ప్రస్తావన ద్వారా వాటిని తమ దృష్టికి తేవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
వారికి నియామక ఉత్తర్వులివ్వం..
పోలీస్ కానిస్టేబుళ్ల నియామకపు ప్రక్రియలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏసీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. నియామకాల్లో హోంగార్డులకు కొంత రిజ ర్వేషన్ ఉందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందులో భాగంగా వారికి ఓపెన్ కేటగిరీలో స్థానం కల్పించామన్నారు. ఇది అసలే సరికాదన్నది ప్రాథమికంగా తమ అభిప్రాయమని ధర్మాసనం పేర్కొంది. ఓపెన్ కేటగిరీకి నిర్దేశించిన 80 మార్కులకన్నా తక్కు వ వచ్చిన హోంగార్డుల్లో ఎందరికి ఓపెన్ కేటగిరీలో స్థానం కల్పించారని ప్రశ్నించింది. 188 మందికని ఏజీ బదులిచ్చారు. నియా మకపు ప్రక్రియ ఆగడానికి వీల్లేదని, కావాలం టేగా 188 మందికి నియామకపు ఉత్తర్వులివ్వ బోమని తెలిపారు. తాము నిబంధనల మేరకు నడుచుకున్నామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ తెలిపారు.
ర్యాంకుల విధానం గందరగోళం...
ర్యాంకుల విధానం గందరగోళంగా ఉందని, విధానమంటూ లేకుండా నిర్ణయిం చారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయ వాది సరసాని సత్యంరెడ్డి అన్నారు. జిల్లాలవారీగా అభ్యర్థులకొచ్చిన మార్కు లు, ర్యాంకులు తదితర వివరాలను బహి ర్గతం చేసేలా ఆదేశించాలని కోర్టును కోరా రు. వాటినెందుకు బయటపెట్టడం లేదని ధర్మాసనం ప్రశ్నించగా, అన్ని వివరాలూ వైబ్సైట్లో ఉన్నాయని ఏజీ చెప్పారు. దాని తో సత్యంరెడ్డి విభేదించారు. ఆయన కోరు తున్న వివరాలను బయటపెట్టాలని ఏజీకి ధర్మాసనం స్పష్టం చేసింది. సందేహాలున్న అభ్యర్థులు నివృత్తికి భారీగా ఫీజు చెల్లించా ల్సి వస్తోందని, అంతకంటే హైకోర్టుకు రావ డమే చౌకగా ఉందని సత్యంరెడ్డి చెబుతున్నా రని ధర్మాసనం పేర్కొంది. నిజంగా సందే హాలున్న అభ్యర్థులే రావాలనే ఉద్దేశంతో ఆ ఫీజు నిర్ణయించామని విద్యాసాగర్ చెప్పా రు. ఓపెన్ కేటగిరీకి నిర్దేశించిన మార్కులక న్నా తక్కువ వచ్చినా ఆ విభా గంలో స్థానం కల్పించిన 188 మంది హోం గార్డులు మినహా మిగిలిన ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.