ముఖ్యమంత్రితో సబితా ఇంద్రారెడ్డి సమావేశం
హైదరాబాద్ : మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ హోంగార్డుల సమస్యలపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. హోంగార్డుల రోజువారి వేతనాన్ని రూ.200 నుంచి రూ.300లకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు సబిత చెప్పారు.
హోంగార్డుల వేతనం పెంపుదలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే . దీంతో హోంగార్డుల వేతనం నెలకు రూ. 6 వేల నుండి రూ. 9 వేలకు పెరగనుంది. అయితే ఈ పెంపు వచ్చే నెల నుంచి అమలులోకి వస్తుందని తెలుస్తోంది.