'హనీమూన్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటా'
హనీమూన్ ఎలా చేసుకుంటే మీకెందుకని కొత్త పెళ్లి కూతురు బిపాసా బసు రుసరుసలాడుతోంది. ఎవరి లైఫ్ తో వాళ్లు సంతోషంగా ఉంటే మంచిది సలహా కూడా ఇచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే... భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బిపాసా హనీమూన్ కు వెళ్లింది. అక్కడితో ఆగకుండా మేమంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో చూడంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పోస్ట్ చేసింది. వీటిపై నెగెటివ్ కామెంట్లు రావడంతో కొత్త పెళ్లి కూతురికి కోపం వచ్చింది. తమ ఫొటోలపై కొంతమంది చేసిన కామెంట్లు హాస్యాస్పదంగా ఉన్నాయని ఈ బెంగాలీ బ్యూటీ మండిపడింది.
'ఇలాంటి కామెంట్లు చేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తారో తెలియదు. నేను పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్యూటీఫుల్ టవల్ ఆర్ట్ ను ఎందుకు గుర్తించరు. హౌస్ కీపింగ్ ప్రతిభకు టవల్ ఆర్ట్ అద్దం పడుతోంది. ఏదీ మారాలి. నాకు పెళ్లైంది కాబట్టి టవల్ ఆర్ట్ ను ఇష్టపడకూడదా? ఇది హాస్యాస్పదం. ఇతరుల జీవితాల్లో తప్పులు వెదికొద్దు. మీ జీవితంతో మీరు సంతోషంగా ఉండండి. మరిన్ని టవల్ ఆర్ట్ ఫొటోలు పోస్టు చేస్తా. ఎందుకంటే ఐ లవ్ ఇట్. ఇలాంటి ప్రతిభను అభినందించే వాళ్లు చాలా మంది ఉన్నారని భావిస్తున్నానని' బిపాసా క్లాస్ పీకింది.