బహుముఖ ప్రజ్ఞాశాలి అచ్యుతరామరాజు
సీతంపేట: రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా, విమర్శకుడిగా, విశ్లేషకుడిగా, రాజకీయ నాయకుడిగా, కథకుడిగా అన్ని ప్రక్రియలను చేపట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి గణపతిరాజు అచ్యుతరామరాజు అని వక్తలు కొనియాడారు. నవజీవన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతిరాజు అచ్యుతరామరాజు స్మారక పురస్కారాలను శనివారం ప్రదానం చేశారు.
ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సాహితీవేత్త సన్నిధాన నరసింహశర్మకు, కథా, నవలా రచయిత ద్విభాష్యం రాజే శ్వరరావుకు ఈ స్మారక పురస్కారాలను మాజీమంత్రి దాడి వీరభద్రరావు అందజేశారు. దాడి మాట్లాడుతూ దేవులపల్లి కృష్ణశాస్త్రి తర్వాత అన్ని ప్రక్రియలు చేపట్టిన వ్యక్తి అచ్యుతరామరాజు అనడంలో అతిశయోక్తి లేదన్నా రు. అచ్యుతరామరాజు తనయుడు పెరుమాళ్ల రాజు సంక లనం చేసిన ’అచ్యుతరామరాజు అంతరంగం ఆత్మీ యానుబంధాలు, జ్ఞాపకాలు’ రెండోభాగం పుస్తకాన్ని ఆయ న ఆవిష్కరించారు.
పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ అంతటి గొప్పవ్యక్తి స్మారక పురస్కారాన్ని అందుకోవడం పూర్వజన్మసుకృతమన్నారు.కార్యక్రమంలో సాహితీ వి మర్శకుడు చందు సుబ్బారావు, కథా రచయిత చింతకిం ది శ్రీనివాసరావు, నవజీవన్ ఫౌండేషన్ కార్యదర్శి అడపా రామకృష్ణ, కార్యనిర్వాహకుడు సుసర్ల సర్వేశ్వరశాస్త్రి, మేడా మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.