కోల్‌కతాలో మొదటి మహిళా అధికారి మృతి
కోల్‌కతా: కోల్‌కతాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో మహిళా పోలీసు అధికారి దేబశ్రీ చటర్జీ మరణించారు. కాగా ఈ ప్రమాదంలో మరో ఇద్దరు అధికారులు, దేబశ్రీ చటర్జీ డ్రైవర్, వ్యక్తిగత గార్డ్లు మరణించారు. అయితే కొల్‌కత్తలో మొదటి మహిళా పోలీసు అధికారి(12వ బెటాలియన్ కమాండెంట్లో ఇన్చార్జిగా) దేబశ్రీ చటర్జీ విధులు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తె దేబశ్రీ చటర్జీ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని హోడ్లా జిల్లా దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కోల్‌కతాకు ప్రయాణిస్తుండగా భారీ ట్రక్కు(ఇసుకతో నిండిన) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దేబశ్రీ చటర్జీ, ఆమె బాడీగార్డ్ తపస్ బర్మన్, డ్రైవర్ మనోజ్ తీవ్రంగా గాయపడ్డారు.
అయితే చికిత్స కోసం వీరిని ఐబీ సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన ముగ్గురిని డాక్టర్ పరిశీలించి, మృతి చెందినట్లుగా ద్రువీకరించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి సీనియర్ పోలీసులు అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. మరోవైపు సైబర్ సెల్, మహిళల రక్షణ, డిటెక్టివ్ విభాగాలలో ముఖ్య విభాగాలలో దేబశ్రీ చటర్జీ కీలక పాత్ర పోషించారు