hormone production
-
ప్యాంక్రియాటైటిస్ వస్తే?
దేహంలోని జీవక్రియల్లో ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంధి)ది కీలక పాత్ర. దీని నుంచి అవసరమైనప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌నుంచి శక్తిని తీసుకుని వినియోగించుకునేలా, అలాగే అవసరం లేనప్పుడు అదే మళ్లీ అదే గ్లూకోజ్‌ను రక్తం నుంచి తొలగించి, కాలేయంలో భద్రపరచుకునేలా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అవసరమైనప్పుడు శక్తిని తీసుకునేందుకు గ్లూకగాన్, అవసరం లేనప్పుడు మళ్లీ నిల్వ చేసుకునేందుకు ఇన్సులిన్ అనే హార్మోన్లను ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ లోపం వల్లనే డయాబెటిస్ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది సొమాటోస్టాటిన్ అనే హార్మోన్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఓ చిన్న గొట్టం ద్వారా జీర్ణప్రక్రియకు అవసరమైన క్లోమరసం కూడా వచ్చి చిన్నపేగుల దగ్గర కలుస్తుంది. ఏవైనా కారణాల వల్ల ఈ క్లోమరసం తాలూకు స్రావాల్లోని ప్రోటీన్లు ఉండల్లాగా మారి, క్లోమరసాన్ని తీసుకెళ్లే గొట్టానికి అడ్డుపడ్డప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథికి ఇన్ఫెక్షన్ రావచ్చు. కొన్నిసార్లు ప్యాంక్రియాస్ గ్రంథిలోనే రాళ్లలా ఏర్పడవచ్చు. ఇలా జరగడాన్ని ‘ప్యాంక్రియాటైటిస్’ అంటారు. నిజానికి ఇది అంత ప్రాణాంతకం కానప్పటికీ, కొందరిలో మాత్రం తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే దీనికి చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు : ► తిన్నది జీర్ణం కాకపోవడం ► ఏదైనా తిన్నవెంటనే కడుపులో తీవ్రమైన మంట, నొప్పి ► స్వల్పంగా జ్వరం ► పొట్టభాగం ఎడమవైపున పైభాగంలో లేదా మధ్య భాగంలో నొప్పి మొదలై కొన్ని సందర్భాల్లో అది వీపుకు వైపునకు పాకుతుండటం ► కామెర్లు ఠీ పొట్ట ఉబ్బరం ఠీ వాంతి అవుతున్నట్లు అనిపిస్తుండం (వికారం) ► కొందరిలో విరేచనాలు కావడం ► కడుపుపైన తాకితే భరించలేనంత బాధ (టెండర్నెస్) ► కొందరిలో కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం... వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కారణాలు : ఏ కారణం లేకుండానే పాంక్రియాస్లో రాళ్ల వంటివి రావడం జరుగుతుంది. అయితే కొందరిలో మితిమీరిన మద్యపానం చాలావరకు పాంక్రియాటైటిస్‌కు కారణమవుతుంది. నిర్ధారణ పరీక్షలు : బాధితులకు కొన్ని రక్తపరీక్షలు, సీరమ్ లైపేజ్ పరీక్షలు, సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు చేసి, పాంక్రియాస్ నుంచి వచ్చే నాళం ఎంత దెబ్బతిన్నదీ, ఆ గ్రంథి ఏ మేరకు ఉబ్బి ఉంది అన్న విషయాలు తెలుసుకుని చికిత్స ప్రారంభిస్తారు. చికిత్స : పాంక్రియాటైటిస్ తీవ్రత చాలా తక్కువగా ఉంటే కొన్ని రకాల మందులతో దాన్ని తగ్గించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు. మందులతో తగ్గనప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల ల్యాపరోస్కోపిక్ / కీహోల్ శస్త్రచికిత్సలతో కడుపుపై కత్తితో కోయకుండానే, చిన్నపాటి గాట్లతోనే శస్త్రచికిత్స చేసి, ప్యాంక్రియాస్ గ్రంథిలోని దెబ్బతిన్న ప్రాంతాన్ని తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల హాస్పిటల్లో ఉండాల్సిన సమయం, ఇతర ఇన్ఫెక్షన్లు, సర్జరీ తర్వాత వచ్చే దుష్పరిణామాలు బాగా తగ్గిపోతాయి. -
హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే సుగంధ నూనెలు!
అరోమా థెరపీ గురించి మీరు వినే ఉంటారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మాత్రమే కాకుండా.. అనేకానేక రుగ్మతలకు సుగంధ నూనెల వాడకంతో ఉపశమనం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే మిగిలిన వాటి మాటెలా ఉన్నా.. లావెండర్, ‘టీ ట్రీ ఆయిల్’లతో మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. కౌమార వయసులో బాలుర రొమ్ములు అసాధారణంగా పెరిగిపోయే అతి అరుదైన రుగ్మతకు ఈ నూనెలు కారణమవుతున్నాయని వీరు అంటున్నారు. హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేయడం దీనికి కారణమని 2007లోనే ఒక పరిశోధన స్పష్టం చేసింది. అయితే ఈ నూనెలను సమర్థించే వర్గానికి చెందిన శాస్త్రవేత్తలు 2013లో ఓ పరిశోధన ద్వారా ఈ నూనెలకూ... హార్మోన్ల ఉత్పత్తికి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాజాగా జరిగిన అధ్యయనం మాత్రం ఎసెన్షియల్ నూనెల్లోని ఎనిమిది రసాయనాలతో ముప్పు తప్పదని పునరుద్ఘాటిస్తోంది. ఈ నూనెలను ఎలాంటి నియంత్రణ లేకుండా అమ్ముతున్నారని.. వచ్చే సమస్యల గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వీటి వాడకం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. -
పొడగరులకు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు
పొడగరులకు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఐదున్నర అడుగుల పొడవు ఉండే వారితో పోలిస్తే ఆరడుగులకు పైబడి పొడవుగా ఉండే పురుషుల్లో ఈ ముప్పు 21 శాతం ఎక్కువగా ఉంటుందని ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పొడవుకు తోడు అధిక బరువు కూడా ఉన్నట్లయితే ఈ ముప్పు మరో 13 శాతం వరకు పెరుగుతుందని వారు అంటున్నారు. పొడవుగా ఉండేవారిలో నడి వయసులో నడుము చుట్టుకొలత నాలుగు అంగుళాలకు మించి పెరిగినట్లయితే ఈ ముప్పు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని, నడి వయసులో పెరిగే అదనపు బరువు వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిలో సంభవించే మార్పులే దీనికి కారణమని వారు వివరిస్తున్నారు. బ్రిటన్‌లో ప్రొస్టేట్ క్యాన్సర్ కారణంగా ఏటా 11 వేల మంది మరణిస్తున్నారని, వారిలో అధిక బరువు ఉన్న పొడగరులే ఎక్కువగా ఉంటున్నారని ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ అరోరా పెరెజ్ కోర్నాగో తెలిపారు. -
థైరాయిడ్‌కు హోమియో చికిత్స
మన శరీరంలో ఉండే గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి అతి ముఖ్యమైన గ్రంథి. దీని ప్రభావం అన్ని జీవవ్యవస్థలపైన ఉంటుంది. ఈ గ్రంథి గొంతు భాగంలో థైరాయిడ్ కార్టిలేజ్ అనే మృదులాస్థి పైన ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి టి -3, టి - 4, టి3-ట్రైఅయోడో థైరాక్సిన్, టి4-థైరాక్సిన్ అని రెండు హార్మోన్లు ఉత్పత్తి చేయాలంటే హైపోథైలమస్ పిట్యుటరీ, గ్రంథి నుంచి వచ్చే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టి.ఎస్.హెచ్.) థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరచాలి. థైరాయిడ్ హార్మోన్లో అయోడిన్ అనే మూలకం పాత్ర అతి ముఖ్యమైనది. థైరాయిడ్ హార్మోన్ అన్ని జీవ వ్యవస్థలయిన ...........కార్బోహైడ్రేట్. కొవ్వుపదార్థాల జీవవ్యవస్థలు, బేసల్ మెటబాలిక్ రేట్ (బీఎమ్మార్) శ్వాస వ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, ముఖ్యంగా సంతాన ఉత్పత్తి వ్యవస్థపైన, దీని ప్రభావం ఉంటుంది. పిండదశలోనూ, పుట్టిన తరవాత మొదటి 4- 5 నెలలో దీని ఆవశ్యకత చాలా కీలకమైనది. హైపోథైలమస్ పిట్యుటరీ థైరాయిడ్ వ్యవస్థలలో మార్పు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి ప్రక్రియలో మార్పులు సంభవించి అధిక (హైపర్ థైరాయిడ్), తక్కువ (హైపోథైరాయిడ్ ) వంటివి వస్తాయి. కారణాలు: నేటి మానవ జీవన విధానం ప్రకృతి విరుద్ధంగా ఉండటం, అధిక ఒత్తిడి, సరియైన శారీరక వ్యాయామం లేకపోవడం, పౌష్టికాహార లోపం వలన థైరాయిడ్ వ్యవస్థలో మార్పులు సంభవించి థైరాయిడ్ బారిన పడతారు. వంశపారంపర్యంగా థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి అయోడిన్ లోపం వలన పార్షియల్ థైరాయిడక్టమీ పిట్యుటరీ గ్రంథిలో వచ్చే వ్యాధుల వలన కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. రకాలు 1) హైపోథైరాయిడిజం: ఇది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్ వ్యాధి. శరీరంలో కావలసినదాని కంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఇది వస్తుంది. ఏ వయసులో ఉన్న వారైనా ఈ హైపోథైరాయిడిజానికి గురి కావచ్చు. పిల్లలు, స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు పిల్లల్లో: బుద్ధిమాంద్యం, ఎదుగుదల లోపం, జ్ఞాపకశక్తి లేకపోవడం, మలబద్దకం, చురుకుదనం కోల్పోవడం, వయసుకి మించి లావుగా ఉండటం. యుక్తవయస్కులలో: ఒంట్లో నీరు చేరి బరువు పెరగడం, బిఎంఆర్ తగ్గిపోవడం, రజస్వల (మెనార్కి) ఆలస్యం కావడం, ఋతుచక్రం ఆలస్యం కావడం, అమెనోరియా, నెలసరిలో అధిక రక్తస్రావం/ అల్ప రక్తస్రావం ఉండటం, సంతానలేమి, చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలటం, బద్దకంగా ఉండి పనిచేయాలనిపించక పోవడం, చలి తట్టుకోలేకపోవడం. ఆడవారిలో రోజూ వేసుకునే దుస్తులు, గాజులు బిగుతు కావడం, అల్వికేరియా అనే చర్మ సంబంధిత వ్యాధుల వంటి లక్షణాలతో హైపోథైరాయిడ్‌ను సులువుగా గుర్తించవచ్చు. 2) హైపర్ థైరాయిడజమ్: థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో థైరాక్సిన్‌ను విడుదల చేయడం వలన వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ అంటారు. లక్షణాలు : ఆహారం సరియైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, నిద్రలేమి, గుండెదడ, అధిక చెమట, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండటం, నెలసరి త్వరగా రావడం, ఋతుచక్రంలో అధిక రక్తస్రావం జరగడం 3) హషిమోటోస్ థైరాయిడైటిస్: ఇది జీవనక్రియల అసమతుల్యత వలన వచ్చే థైరాయిడ్ (ఆటో ఇమ్యూన్). దీనిలో థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా యాంటీ బాడీస్ ఉత్పన్నమై, థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పని చేయనివ్వవు. ఇందులో హైపో మరియు హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. గాయిటర్: థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి కావడాన్ని గాయిటర్ అంటారు. కొన్ని సందర్భాలలో దీని పరిమాణం కంటే రెండింతల పరిమాణం వాపు వచ్చి స్వరపేటిక పైన ఒత్తిడి చేయడం వల్ల వాయిస్‌లో మార్పు వస్తుంది. గాయిటర్‌లో థైరాయిడ్ హార్మోన్లు టి - 3, టి - 4 సాధారణస్థితిలో ఉన్నప్పటికీ గాయిటర్ లేనట్టుగా నిర్థారించలేం. కారణాలు: అతి ముఖ్యమైన కారణం... అయోడిన్ అనే మూలకలోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. గ్రేవ్స్ డిసీజ్ పిట్యుటరీ గ్రంథి ట్యూమర్స్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు గొంతు కింద వాపు వచ్చి మింగడానికి కష్టంగా ఉంటుంది స్వరంలో మార్పులు రావడం ఎక్సా ఆప్తల్మిక్ గాయిటర్ అనగా కనుగుడ్లు బయటికి పొడుచుకు వచ్చినట్టుగా ఉండటం టిబియల్ విక్సెడిమా. నిర్థారణ పరీక్షలు థైరాయిడ్ ప్రొఫైల్ టి-3, టి-4, టిఎస్హెచ్ యాంటీ థైరాయిడ్ యాంటీ బాడీస్ యూఎస్ ఈ ఆఫ్ థైరాయిడ్ గ్రంథి గొంతు యొక్క సీటీ స్కాన్ హోమియో చికిత్స చాలామంది పేషెంట్లకు దీనిపై అవగాహన తక్కువ. థైరాయిడ్‌కు మందులు లేవు, జీవితాంతం థైరాక్సిన్ వాడడం తప్ప మరో మార్గం లేదనుకుంటారు. అదేవిధంగా చాలామందికి హోమియో వైద్యంపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అలా అనుకుంటారు. తాము తీసుకునే థైరాక్సిన్ అనేది ట్రీట్మెంట్ కాదు, సప్లిమెంట్ అని తెలియదు. హోమియో వైద్యంలో రోగి శరీర తత్త్వాన్ని బట్టి సరైన చికిత్స ఇస్తే తప్పక అనతికాలంలో నయం చేయవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్ రోగి శరీరతత్త్వాన్ని బట్టి జెనిటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలిమం విధానం ద్వారా హైపోథైలమస్ పిట్యుటరీ థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం వలన థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చును.