అరోమా థెరపీ గురించి మీరు వినే ఉంటారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మాత్రమే కాకుండా.. అనేకానేక రుగ్మతలకు సుగంధ నూనెల వాడకంతో ఉపశమనం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే మిగిలిన వాటి మాటెలా ఉన్నా.. లావెండర్, ‘టీ ట్రీ ఆయిల్’లతో మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. కౌమార వయసులో బాలుర రొమ్ములు అసాధారణంగా పెరిగిపోయే అతి అరుదైన రుగ్మతకు ఈ నూనెలు కారణమవుతున్నాయని వీరు అంటున్నారు. హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేయడం దీనికి కారణమని 2007లోనే ఒక పరిశోధన స్పష్టం చేసింది.
అయితే ఈ నూనెలను సమర్థించే వర్గానికి చెందిన శాస్త్రవేత్తలు 2013లో ఓ పరిశోధన ద్వారా ఈ నూనెలకూ... హార్మోన్ల ఉత్పత్తికి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాజాగా జరిగిన అధ్యయనం మాత్రం ఎసెన్షియల్ నూనెల్లోని ఎనిమిది రసాయనాలతో ముప్పు తప్పదని పునరుద్ఘాటిస్తోంది. ఈ నూనెలను ఎలాంటి నియంత్రణ లేకుండా అమ్ముతున్నారని.. వచ్చే సమస్యల గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వీటి వాడకం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది.
హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే సుగంధ నూనెలు!
Published Tue, Mar 20 2018 1:19 AM | Last Updated on Tue, Mar 20 2018 1:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment