నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాలేవి? : బీజేవైఎం
కొత్తకోట (చిత్తూరు) : గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాల భర్తీ హామీలను టీడీపీ సర్కారు అమలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రాజు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్స్లీహిల్స్ కొండపై బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వెనుక కేంద్ర ప్రభుత్వం కృషి ఉందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నేతలు హాజరయ్యారు.