horti culture
-
హార్టికల్చర్ హబ్.. అంతా హుళక్కే
‘వైఎస్సార్ జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చేస్తామంటే నిజమేనని అనుకున్నాం. లెక్కలేనని ఉప ఉత్పత్తుల పరిశ్రమలు వచ్చేస్తాయని చెప్తే మంచిరోజులొస్తాయని భ్రమపడ్డాం. అదుగో ఉద్యాన పంట ఉత్పత్తులు కొనేందుకు దేశీయ, విదేశీ కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టేస్తున్నాయంటూ హోరెత్తిస్తే నిజమేననుకున్నాం. అవన్నీ ఒట్టి మాటలేనని తేలిపోయాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డే మమ్మల్ని బురిడీ కొట్టించారు. మా ఉద్యాన రైతుల ఆశలను అడియాశలు చేశారు’ అని వైఎస్సార్ జిల్లా రైతులు గోడు వెల్లబోసుకున్నారు. ‘సీఎం, మంత్రి జిల్లాకు వచ్చినప్పుడల్లా హార్టికల్చర్ హబ్ అంటూ ఊదరగొట్టారు. గిట్టుబాటు ధర లేకపోతే రూ.4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి తామే పంటను కొంటామని భరోసా ఇచ్చారు. ఆ హామీలన్నీ గాలి మూటలయ్యాయి. మాకు తీవ్ర అన్యాయం చేశారు’ అని వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ‘సాక్షి’ నిర్వహించిన రచ్చబండలో రైతులు వాపోయారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి దారుణంగా మోసగించారు. ఉప ఉత్పత్తుల పరిశ్రమలు ఎక్కడ? రూ.4వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అంటూ ఎందుకు మోసగించారు? రచ్చబండలో రైతులు ఏం చెప్పారంటే.. జిల్లాలో 36 రకాలకు పైగా ఉద్యాన పంటల్ని పండిస్తున్నాం. పక్క జిల్లాలో పలు రకాల కంపెనీలను తీసుకువచ్చి దిగుబడుల్ని కొనుగోలు చేయిస్తున్నారు. అందుకు బడ్జెట్లో రూ.45 కోట్లు అదనంగా కేటాయించారు. రైపనింగ్ చాంబర్లు, కోల్డ్ స్టోరేజీలు, గ్రేడింగ్ యూనిట్లు, ఉప ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేశారు. మా జిల్లాపై మాత్రం చిన్న చూపు చూశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లో పులివెందుల అరటి, వీరబల్లి బేనిషా మామిడికి మంచి పేరుంది. జిల్లా నుంచి ఢిల్లీ, ముంబై, నాగపూర్, చెన్నై, వేలూరు, హైదరాబాద్, బెంగళూరు, పుణే, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ మార్కెట్లకు మేమే సొంత ఖర్చులతో ఎగుమతి చేస్తున్నాం’ అని ఓ రైతు ఇక్కట్లను ఏకరువు పెట్టాడు. మరో రైతు అందుకుంటూ ‘జిల్లాలో 1.11 లక్షల హెక్టార్లలో అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, నిమ్మ, జామ, దానిమ్మ, సపోటా, పూల తోటలు, కూరగాయ పంటలు సాగు చేస్తున్నాం. ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో ఏటా రూ. 600 కోట్లు నష్టపోతున్నాం. మార్కెటింగ్ లేక దళారులను, వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం. గిట్టుబాటు ధర లేనప్పుడు విలువ ఆ«ధారిత ఉత్పత్తుల తయారీకి అవసరమైన గ్రేడింగ్, ప్రాసెసింగ్, జ్యూస్, పల్ప్, పౌడర్ పరిశ్రమల యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. దీంతో అయినకాడికి అమ్ముకుంటున్నాం. జిల్లాలో అరటి కోసం బనానా కోల్డ్ చైన్ పేరిట రూ.5–6 కోట్లతో ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి ఐదేళ్లవుతున్నా వాటికి దిక్కూమొక్కూలేవు. అపెడా, వాల్‌మార్ట్, ఫ్యూచర్ గ్రూప్స్, ఐఎన్ఐ కంపెనీలు జిల్లాకు వస్తున్నాయంటూ ఆశలు కల్పించినా ఒక్క కంపెనీ కూడా రాలేదు’ అని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి, అరటి, బొప్పాయి, చీనీ, నిమ్మ, కూరగాయల పంటలు సాగు చేసే రైతులతో 52 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటైనా, మా గ్రూపుల వద్దకు వచ్చి ఇంతవరకూ పంటను కొనుగోలే చేయలేదని ఇంకొకరు వాపోయారు. జిల్లాలో సాగవుతున్న పండ్ల తోటలు (హెక్టార్లలో) 1,11,254 పండ్ల తోటల నుంచి దిగుబడి (టన్నుల్లో) 28,47,519 పంట ఉత్పత్తుల ఆదాయం (రూ. కోట్లలో) 1,775 పరిశ్రమలు లేక నష్టపోతున్న మొత్తం (రూ. కోట్లలో) 600 గ్రూపు ఏర్పాటైనా ఒరిగిందేమీ లేదు ప్రభుత్వం ఊరించడం తప్ప ఉద్యాన రైతుకు చేసిందేమీలేదు. అరటి, మామిడి, బొప్పాయి రైతులు గ్రూపులుగా ఏర్పాటవ్వాలని చెప్పారు. ఇంతవరకు ఒక టన్ను కూడా కొనుగోలు చేయలేదు. ప్రత్యేక పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. ధరల స్థిరీకరణ నిధిని రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పినా అది ఏమైందో ముఖ్యమంత్రికే తెలియాలి. ప్రతి ఏటా తక్కువ ధరకు అరటి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. –కె.చంద్రశేఖరరెడ్డి, లింగాల ఉప ఉత్పత్తుల పరిశ్రమ ఒక్కటీ రాలేదు అరటి నుంచి జ్యూస్, క్రీములు, వడియాలు, నారు, పేపరు ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలు వస్తున్నాయని సీఎం పార్నపల్లె లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు గొప్పలు చెప్పారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. నాలుగైదు రోజులు నిల్వ ఉన్నా చెడిపోనంత నాణ్యత కలిగిన కాయలు ఇక్కడి ప్రత్యేకత. సీఎం మాటలు చెప్పడం తప్ప ఉద్యాన రైతులకు చేసిందేమీ లేదు. –ఎంసీ శేఖరరెడ్డి, లింగాల హార్టికల్చర్ హబ్ లేదు.. అంతా ఉత్తిదే హార్టికల్చర్ హబ్ వస్తుంది. పరిశ్రమలు, ఉప పరిశ్రమలు వస్తాయని ఐదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాం. పంటకు గిట్టుబాటు ధర వస్తుందని ఆశించాం. అవేమీ రాలేదు. చివరకు దళారులను ఆశ్రయించి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. – అలవలపాటి ప్రతాప్‌రెడ్డి, లింగాల మార్కెట్ సదుపాయం కల్పించకుండా దగా లింగాల మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు సార్లు వచ్చారు. ఇక్కడి రైతులు బంగారం పండిస్తున్నారని, అరటికి మార్కెట్ సదుపాయం కల్పిస్తామని, రైతులను లక్షాధికారుల్ని చేస్తామని నమ్మబలికారు. – ఎ.శంకరరెడ్డి, లింగాల -
సత్ఫలితాలిస్తున్న ‘సీడ్ బాల్స్’
కెరమెరి : గతేడాది విత్తన బంతుల ద్వారా నూతన ప్ర యోగానికి శ్రీకారం చుట్టిన అటవీ అధికారులు ప్రణా ళిక విజయవంతమవుతుంది. ప్లాస్టిక్ కవర్లలో స్టంపు పెట్టి వాటికి నీరు పోసి బతికించే దానికంటే మట్టితో వివిద రకాల వస్తువులు కలిపి తయారు చేసిన విత్తన బంతులు సీడ్ బాల్స్ తోనే అధిక ప్రయోజనం ఉం టుందని భావించిన అటవీ అధికారులు ఈ ఏడాది ప్రతి ష్టాత్మకంగా చేపట్టబోయే హరితహరంలో ఆ ప్రయోగాన్నే అధికంగా వాడనున్నారు. కెరమెరి అటవీ „ó క్షేత్రాధికారి పరిధిలో కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాలు ఉన్నాయి. కెరమెరిలో గతేడాది రేంజ్‌లోని కొప్పగూడలో 2 వేలు, గోయగాంలో 2 వేలు, సాంగ్వి లో 2 వేలు, ధోబోలిలో 2 వేలు, బిర్లఘాట్లో రెండు వే లు మొత్తం 10 వేల విత్తన బంతులు విసరగా 6 వేలు ప్రస్తుతం సజీవంగా ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. రెండు వందల ఎకరాల్లో విత్తన బంతులు కెరమెరి రేంజ్ మొత్తం 60 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో విత్తన బంతులు గత సంవత్సరం 200 ఎకరాల్లో విసరారు. ఆ బంతులన్ని అటవీ ప్రాంతంలో విసరడం తో పాటు అధికారులు అటువైపుగా పశువులు మేపకుండా చర్యలు తీసుకోవడంతో ఆ మొక్కలు సజీ వంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం అయితే ఈ సంవత్సరం 25 వేల విత్తన బంతులను వేయాలని అటవీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేంజ్‌లోని అన్ని మండలాల్లో నర్సరీ పనులు ప్రారంభమైయ్యాయి. లక్ష్యం 5 లక్షల మొక్కలు గతేడాది కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాల్లో అటవీ అధికారులకు మూడు లక్షల మొక్కలు నాటా రు. ఈ సంవత్సరం ఐదు లక్షల మొక్కలను నాటాలని అధికారులు ఆదేశించారు.. అందులో మూడు మండలాల్లోని సాంగ్వి, కెరమెరి, దుబ్బగూడ, కోహినూర్, రాసిమొట్టల్లో 5 లక్ష్యల మొక్కలను నాటనున్నారు. ఒక్కో నర్సరీలో లక్ష మొక్కలను నాటనున్నారు. అయి తే అధికారుల కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 25 మంది అటవీ సిబ్బంది ఉండాల్సి ఉండగా ఎప్ ఎస్వోలు ఐదుగురు, ఎఫ్‌బీవోలు ఐదుగురు మాత్రమే ఉన్నారు. పండ్ల మొక్కలకు ప్రాధాన్యం మా నర్సరీల్లో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కల కు అధిక ప్రాధాన్యం ఇస్తాం. గతేడాది కూడా వివిద రకాల పూలు, పండ్ల మొక్కలను నర్సరీల్లో పెంచాం. ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. వివిద రకాల మొక్కలను అందుబాటులో ఉంచుతాం. – సయ్యద్ మజరుద్దీన్, ఎఫ్ఆర్వో, కెరమెరి -
ఉద్యాన పంటల అభివృద్ధి
ఉద్యాన వన శాఖ డీడీహెచ్ హనుమంతరావు ఆత్మకూరురూరల్: ఆత్మకూరు ప్రాంతాల్లో ఉద్యానవన పంటల అభివృద్ధికి రూ.12 కోట్లు మంజూరైనట్లు ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ పావులూరి హనుమంతరావు తెలిపారు. మండలంలోని నెల్లూరుపాళెం, పేరారెడ్డిపల్లి గ్రామాల్లోని పండ్ల తోటలు, ప్యాక్‌హౌస్‌లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల్లో యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని రైతులకు సూచించారు. తోటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ తెగుళ్ల నివారణకు మందులను పిచికారీ చేయాలన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పండ్ల తోటలు, హైబ్రిడ్ పూలతోటలు, కూరగాయల సాగు, నిమ్మ, మామిడి ముదురు తోటల పునరుద్ధరణకు ఆత్మకూరుకు రూ.5.8 కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్యాక్‌హౌస్‌ల నిర్మాణానికి సబ్సిడీపై నిధులు అందజేస్తుందన్నారు. పండ్ల ప్యాకింగ్, నిల్వకు ప్యాక్‌హౌస్‌లు తోడ్పడుతాయని తెలిపారు. ఆయన వెంట ఉద్యానవనశాఖ అధికారిణి పెద్దిలక్ష్మి, సాంకేతిక అధికారి కలీం, ఏఈఓ విజయమ్మ, తదితరులు ఉన్నారు. -
పాలమూరు రైతుకు మొండిచేయి
గద్వాల, న్యూస్‌లైన్: పంట నష్టపరిహారం అందించడంలోనూ పాలకులు పాలమూరు రైతాంగంపై సవతితల్లి ప్రేమ చూపుతున్నారు. కరువు నేలలో పంటలు పండించలేక ఈ ప్రాంతరైతులు వలసబాట పట్టారు. ఉన్న ఊరు, పొలాలను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న కొద్దిమంది రైతులకు కూడా సర్కారు సాయం అందడం లేదు. ఈ రెండేళ్లలో జిల్లాలో పండ్లతోటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందకపోవడమే ఇందుకు నిదర్శనం. కానీ పొరుగు జిల్లా నల్గొండకు పరిహారం మంజూరుచేసి జిల్లా రైతులను విస్మరించడం శోచనీయం.. జిల్లాలో పండ్లతోటలకు నెలవుగా ఉన్న గద్వాల డివిజన్లో బత్తాయి, మామిడి వంటి తోటలను వేలాది హెక్టార్లలో సాగుచేశారు. గతేడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో దశాబ్దాలుగా పండ్లతోటలపై ఆధారపడి..వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రనష్టాలను చవిచూశారు. తోటలకు నీళ్లందించలేని పరిస్థితుల్లో జిల్లాలో గతేడాది సుమారు 5,150 హెక్టార్లలో బత్తాయి, మామిడి తదితర పండ్లతోటలను నష్టపోయారు. ఈ ఏడాది సుమారు 800 హెక్టార్లలో పంటతోటలకు నష్టం వాటిల్లింది. తమను ఆదుకోవాలని బాధితరైతులు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. నివేదిక బుట్టదాఖలు! రైతుల విజ్ఞప్తి మేరకు మండలాలు, గ్రామాలవారీగా ఎండిపోయిన తోటల వివరాలను 2011-12లో ఉద్యానవన శాఖ, రెవెన్యూ అధికారుల ద్వారా సంయుక్త సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీనిప్రకారం 2011-12లో గద్వాల డివిజన్లోని మల్దకల్, ధరూరు మండలాల్లో అత్యధికంగా, మిగతా మండలాల్లోనూ బత్తాయి తోటలు ఎక్కువగా, మామిడి తోటలు అక్కడక్కడ ఎండిపోయినట్లు నివేదికలు సిద్ధంచేశారు. కేవలం గద్వాల డివిజన్లో 1853 హెక్టార్లలో పండ్లతోటలు నీళ్లందక ఎండిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే 2012-13లోనూ అయిజ, గట్టు మండలాల్లో ఎక్కువగా, మిగతా మండలాల్లో అక్కడక్కడ బత్తాయి, మామిడి తోటలు 145 హెక్టార్లలో ఎండిపోయినట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ రెండేళ్ల నివేదికలు ప్రభుత్వం వద్దే ఉండిపోయాయి తప్ప పరిహారం మంజూరుకాలేదు. కాగా, గతనెలలో పరిహారం అందజేసేందుకు రైతులు, బ్యాంకు ఖాతాలను ఉద్యానవన శాఖాధికారులకు అందజేయాలని ప్రకటన జారీకావడంతో బాధితరైతుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. ఖాతాలను అందజేసినా పరిహారం ఇప్పటికీ మంజూరుకాలేదు. అయితే పక్కనే ఉన్న నల్గొండ జిల్లాలోని పండ్లతోటల రైతులకు 2011-12 సంవత్సరానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇప్పటికే అందజేసినట్లు హార్టికల్చర్ అధికారుల ద్వారా తెలిసింది. పాలమూరు జిల్లాలో నష్టపోయిన రైతులను మాత్రం పట్టించుకోవడం లలేదు. ఇకనైనా జిల్లా అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి నష్టపోయిన తమకు పరిహారం వచ్చేవిధంగా చూడాలని బాధితరైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.