వివాహిత ఆత్మహత్యాయత్నం?
రొద్దం: రొద్దం మండలం సుబ్బరాయప్పగారి కొట్టాలకు చెందిన శిల్ప(30) అనే వివాహిత బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు బంధువులు తెలిపారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో భర్త ఇంట్లో ఉండగా ఈ ఘటన జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరుగుపొరుగు వారు వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోవిందప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవాలు ఏమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.