బన్నీ డాడీ అయ్యాడు
జీవితంలో మధురమైన అనుభూతులు ఎన్నో ఎదురవుతాయి. కానీ, కొన్ని అనుభూతులు ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన అనుభూతిలో ఉన్నారు అల్లు అర్జున్. ఆయన భార్య స్నేహ శుక్రవారం ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ‘తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు’ అని అల్లు అర్జున్ తన ఫేస్బుక్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని బర్త్ ప్లేస్ ఆస్పత్రిలో గురువారం రాత్రి 11 గంటల 55 నిమిషాలకు బిడ్డకు జన్మనిచ్చారు స్నేహా. కొత్త మెంబర్ రాకతో అల్లు కుటుంబం మొత్తం ఆనందంలో ఉంది. పైగా బన్నీ పుట్టినరోజు ఈ నెల 8న. సో.. ఇక నుంచి అల్లు కుటుంబంలో ప్రతి ఏడాదీ ఒకే వారంలో రెండు పండగలన్నమాట!