hot dogs
-
ఈటింగ్ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి
ఈటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న ఓ విద్యార్థిని మృతిచెందిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. గెలవాలనే తొందరలో ఆహారం గొంతులో ఇరక్కుపోయి, ఊపిరాడక అర్థాంతరంగా తనువుచాలింది. అసలేంజరిగిందంటే.. అమెరికాలో టఫ్ట్స్ యూనివర్సిటీ గతవారం హాట్ డగ్స్ ఈటింగ్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్లో అదే యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చదువుతున్న మడ్లిన్ అనే 20 ఏళ్ల విద్యార్థిని కూడా పాల్గొంది. ఐతే హఠాత్తుగా హాట్ డగ్ గొంతులో ఇరుక్కుపోవడంతో, ఊపిరిఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్వహణ బృందం హుటాహుటిన బోస్టన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంతప్రయత్నించినా ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత రోజు ఆమె మరణించిందని వైద్యులు మీడియాకు వెల్లడించారు. నిజానికి ఆమె ఒక గొప్ప అథ్లెట్ కూడా. ఈ విషాద సంఘటన తాజాగా వెలుగుచూసింది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్ వేసిన సైంటిస్టులు
రేక్జావిక్: ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్‌ఫాల్ పర్వతం సమీపంలో ఉన్న అగ్ని పర్వతం వారం రోజుల క్రితం విస్ఫోటనం చెందిన సంగతి తెలిసిందే. 900 వందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది బద్దలవ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్ చేరుకున్న శాస్త్రవేత్తలు పర్వత ప్రాంతంపై నుంచి లావా ప్రవహించే అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే వారు అక్కడ వంట కూడా చేశారు. మీరు చదివింది కరెక్టే.. శాస్త్రవేత్తలు అక్కడ వంట చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. వందల ఏళ్ల తర్వాత ఈ అగ్ని పర్వతం విస్పోటనం చెందడంతో కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్ చేరుకున్నారు. అగ్నిపర్వతం వద్దకు చేరుకున్న శాస్త్రవేత్తల బృందం ఈ విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడమేకాక.. ఈ ఘటనలో వెలువడిన లావాను ఉపయోగించి ఏకంగా వంట చేశారు. 'ఐస్లాండ్ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం వల్ల వెలువడిన లావా హాట్ డాగ్స్‌ను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది' అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది ఇప్పటికే 58కే వ్యూస్ పొందింది. విస్పోటనం వల్ల వెలువడిన వేడి వేడి లావాపై హాట్ డాగ్స్ వండటం, రేకు కాగితంపై శాండ్విచ్లను గ్రిల్ చేయడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. మరొక బృందం ఈ లావా మీద పాన్ పెట్టి గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్ వేయడమేకాక బేకన్ వండుతున్న మరొక వీడియోను యూరుకుర్ హిల్మార్సొన్మ్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఫగ్రడాల్స్ఫాల్లో విస్ఫోటనం ప్రారంభమైన తరువాత గత శుక్రవారం రాత్రి ఎర్రటి మేఘం ఆకాశాన్ని కమ్మెసిందా అన్నట్లు అక్కడి పరిసరాలు మారిపోయాయి. ఇక విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విస్ఫోటనంతో అగ్ని పర్వతం నుంచి బయటకు చిమ్ముతున్న ఎర్రని లావా ప్రవహాన్ని చూపించే ఒక డ్రోన్ ఫుటేజ్ ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సంపాదించింది. విస్ఫోటనం జరగడానికి ముందు నాలుగు వారాల్లో ఈ ద్వీపకల్పంలో 40,000కు పైగా భూకంపాలు సంభవించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ ఆంక్షలు విధించారు. విస్ఫోటనం ప్రజలకు తక్షణ ప్రమాదం కలిగించలేదని అధికారులు వెల్లడించారు. చదవండి: వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా? -
సాయమడగండి... తప్పు లేదు!
వాయనం: ‘ఓ పక్క ఆఫీసులో చాకిరీ చేసి రావాలి... ఇంట్లో పనీ నేనే చేయాలి, నాకు మాత్రం విశ్రాంతి అవసరం లేదా?’... చాలామంది వర్కింగ్ ఉమన్ తరచుగా అనే మాట ఇది. భర్తతో సమానంగా భార్య సంపాదిస్తున్నా, భార్యతో సమానంగా భర్త ఇంటి పని చేయడం ఎక్కడో కానీ కనిపించదు. దానికి కారణాలు రెండు. ఇంటి పని చేయడం ఆడవాళ్ల బాధ్యత అని మగవాళ్లు అనుకోవడం, రెండోది... తనకు సాయం అవసరం అన్న విషయాన్ని భార్యలు భర్తలకు అర్థమయ్యేలా చెప్పలేకపోవడం. చాలామంది భార్యలు రెండు బాధ్యతలనూ నిర్వర్తించలేక అవస్తపడుతుంటారు. తమలో తామే కుమిలిపోతుంటారు తప్ప తమ అవస్థను భర్తకు అర్థమయ్యేలా చెప్పరు. దాని వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? పైగా కొందరైతే... ఏం చేస్తాం, వాళ్లకు తప్పినా మనకు తప్పదు కదా అంటుంటారు. అదీ సరికాదు. ఇంటిని నిలబెట్టుకోవడం కోసం మీకు ఉద్యోగం చేయడం తప్పడం లేదు. అలాంటప్పుడు ఇంటి పనులు చేయడం అతడికి మాత్రం ఎందుకు తప్పుతుంది? ఈ సమస్యను తీర్చుకోవడం కచ్చితంగా ఇల్లాలి చేతిలోనే ఉంది. మీరు మౌనంగా చేసుకుంటూ పోతే, చేయగలుగుతోంది కదా అనుకుంటారు. అందుకే మీరెంత కష్టపడుతున్నారో, ఎంతగా అలసిపోతున్నారో వారికి వివరించండి. కాస్త పనిని పంచుకోమని అడగండి. మరీ వంటిల్లు శుభ్రం చేయడం, వంట చేయడం లాంటివి చేయలేకపోయినా... బట్టలు వాషింగ్ మెషీన్లో వేయడం, తీసి ఆరబెట్టడం, ఆరినవి మడత పెట్టడం, పక్కలు సర్దడం, పిల్లలను స్కూలుకు రెడీ చేయడం వంటివి వారు చేయగలరు కదా! అలాంటివి వారిని చేయమనండి. అది మానేసి వారంతట వారే వచ్చి మీకు సాయం చేసేయాలని మాత్రం చూడకండి. కొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కొందరు చెబితేగానీ గ్రహించరు. మీ భర్త మొదటి కోవకు చెందినవారైతే సమస్య లేదు. ఒకవేళ రెండో కోవకు చెందినవారైతే మాత్రం మీరు వారితో మాట్లాడి తీరాల్సిందే. అర్థమయ్యేలా చెప్పాల్సిందే. సంపాదించే బాధ్యతను ఎలా పంచుకున్నామో, ఇంటిని తీర్చిదిద్దుకునే బాధ్యతను కూడా అలానే పంచుకుందాం అని చెబితే మీవారు తప్పక అర్థం చేసుకుంటారు. అడగందే అమ్మయినా పెట్టదంటారు. ఆయన మాత్రం ఎలా చేసేస్తారు? కాబట్టి ధైర్యంగా మీవారిని సాయమడగండి... తప్పు లేదు! హాట్‌డాగ్స్... హాట్ హాట్‌గా! హాట్‌డాగ్... పాశ్చాత్య దేశాల్లో పుట్టి మన దేశ బేకరీల్లో తిష్ట వేసుక్కూచున్న స్నాక్ ఇది. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో వారికి కూడా దీని రుచి పరిచయమై చాలా కాలమైంది. అయితే వీటిని ఇంట్లో తయారు చేయడం పెద్ద పని. ఒకవేళ బయటి నుంచి తీసుకొద్దామన్నా ఇంటికొచ్చేసరికి చల్లారిపోతాయి. వాటిని వేడి చేయాలంటే మైక్రో అవన్ ఉండాలి. అది కొనాలంటే బోలెడు డబ్బులుండాలి. కానీ అంత పెట్టక్కర్లేకుండా పనైపోయే మార్గం ఒకటుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రాన్ని హాట్‌డాగ్ టోస్టర్ అంటారు. చల్లారిపోయిన హాట్‌డాగ్స్‌ను చిటికెలో వేడి చేసేస్తుందిది. ఇది ఇంట్లో ఉంటే చక్కగా బన్స్, ఫిల్లింగ్స్ని తెచ్చి ఫ్రిజ్‌లో దాచి పెట్టుకోవచ్చు. పిల్లలు బడి నుంచి వచ్చాక, మీరు-మీవారు ఆఫీసుల నుంచి వచ్చాక అప్పటికప్పుడు వీటిని టోస్టర్లో పెట్టేస్తే... పది,పదిహేను నిమిషాల్లో వేగిపోతాయి. వేడి వేడిగా ఆరగించవచ్చు. పిక్నిక్స్కి వెళ్లినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని వెల రెండు వేల వరకూ ఉన్నా ఆన్లైన్ స్టోర్స్‌లో రూ.1775కే లభిస్తోంది!