ఈ టేస్ట్ సెపరేట్ గురూ
సాగర్‌నగర్ : కొత్త లోకం..కొత్త మనుషులు, కొత్త అందాలు, అందమైన ప్రకతి, ఇవ్వన్నీ ఒక స్మార్ట్ విశాఖ బీచ్‌లకే సొంతం. ప్రశాంతంగా ఉన్న ఈ అద్బుతమైన బీచ్ వెంట రుచి నడక ఆనందం, శాంతి ఒక మరుపురాని ఆనుభవాన్ని అందిస్తుంది. రోజుకు వేలాది మంది పర్యాటకులు, సందర్శకులు విచ్చేసే బీచ్‌లో బెస్ట్ రిఫ్రెష్మెంట్...పానీపూరి, మురీమిక్సర్. సందర్శకులు వీటిని రుచి చూడకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ వ్యాపారం మూడు ప్లేట్లు, ఆరు టేస్ట్లుగా విరజల్లుతోంది. ధనికులు సైతం రహదారుల పక్కన ఎటువంటి హంగు ఆర్భాటం లేని బండ్లపై అమ్మే తినుబండారాల రుచి చూస్తుంటారు. అనుకున్నప్పుడు ఆలస్యం లేకుండా ఇష్టమైనది తినడానికి వీలుండడంతో స్ట్రీట్ ఫుడ్...ఇట్స్ డిఫరెంట్ అంటూ లొట్టలు వేస్తున్నారు.
చోటా బిజినెస్.. బడా మార్కెట్: పానీపూరీ, మురీమిక్సర్.. బీచ్‌రోడ్డులో ఎన్నో రకాల స్ట్రీట్ ఫుడ్ దొరుకుతున్నా వీటి ప్రత్యేకతే వేరు. రుషికొండ బీచ్ నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు పానీపూరీ, మురీమిక్సర్ బండ్లు దుకాణాలు కలిపి మొత్తం 225 ఉన్యాయి. ముఖ్యంగా పర్యాటకులు, సందర్శల తాకిడి అధికంగా ఉన్న ఆర్కే బీచ్ (వైఎసార్ విగ్రహం నుంచి ఫిషింగ్ హార్బర్)వరకు మురీమిక్స్ర్, అమ్మేవారు 200 మంది ఉన్నారు. తెన్నేటిబీచ్ పార్కు, రుషికొండ బీచ్‌లో పానీపూరీ విక్రయించేవారు 25 మంది మాత్రమే. ఒక్కొ దుకాణం రోజూ పెట్టుబడి పోనూ రూ.1000కాగా, ఆదివారం రూ.1500 వరకు ఆదాయం ఉంటుంది. అంటే నెలవారీగా రూ.30,000 చొప్పున, ఏటా 3.60 లక్షల రూపాయాలు సగటున ఆదాయం లభిస్తోంది. మొత్తం 225 మంది కలసి ఏడాదికి రూ. 8 కోట్ల, 10లక్షల రూపాయాలు వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఆర్కే బీచ్‌లో దీని బిజినెస్ రెట్టింపుగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మురీమిక్సర్, మురీ బజ్జీ వ్యాపారం ఉంటుంది. తెన్నేటి బీచ్ పార్కు వద్ద పానీపూరీ బిజినెస్ అధికంగా ఉంటుంది. ఇక రుషికొండ బీచ్‌లో పానీపూరి, మురీమిక్సర్, మురీబజ్జీలు, మొక్కజొన్న కంకెలు నోరూరిస్తాయి. రూ.10 నుంచి రూ.20 ధరల్లో లభించే ఈ చట్పటా ఐటెమ్స్ యూత్‌కే కాదు అన్ని వయస్కుల్లోనూ ఫేవరిట్. మురీమిక్సర్కు ఉల్లి, టమాటా, పల్లీలు (వేరుశనగ)పచ్చబటానీ, బజ్జీలు, సాల్ట్,నిమ్మ,మసాల కారం, మరమరాలు కలిపి తయారు చేస్తారు.