అవినీతి వల్లే పేదరికం
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ‘ఏ దేశమైనా అభివృద్ధి బాటలో పయనించాలంటే అధిగమించాల్సిన లక్ష్యం పేదరికం. దీనికి కారణమైన అవినీతి, అక్రమాలను నిర్మూలించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. అది జరగాలంటే రాజకీయ ప్రక్షాలన చేయాల్సిందే. మీడియా కూడా సంచలనం కోసం కాకుండా సామాజిక చైతన్యం, ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలి’... ఇదేదో రాజకీయ ప్రసంగం కాదు. అలాగని సామాజిక కార్యకర్తల ఉపన్యాసమూ కాదు. అంతా చిన్నారులు. దేశంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల అభిప్రా యం. బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో శుక్రవారం నిర్వహించిన ‘ఓక్రిడ్జ్ మోడల్ యునెటైడ్ నేషన్స్ 2013’ సద స్సు సమాజంపై విద్యార్థులకున్న అవగా హనను ఆవిష్కరించింది. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
అచ్చం ఐక్యరాజ్య సమితిలా
ఐక్యరాజ్యసమితిని పోలివుండే హాల్‌ను ఇందులో రూపొందించారు. దేశంలోని 30 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు యూఎన్ సభ్యత్వ దేశాల ప్రతినిధులుగా వ్యవహరించారు. ఆయా దేశాల సమస్యలను సదస్సులో ప్రస్తావించి అబ్బురపరిచారు. ఆసక్తికరంగా సాగిన ఈ సదస్సుకు ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న సంతోష్ వల్లభనేని సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించాడు. ఇందులో ఇంట ర్నేషనల్ సెక్యూరిటీ కమిటీ, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్, యు నెస్కో, ఒలంపియాడ్ కౌన్సిల్, ఇండో పాక్ కేబినెట్ సెక్యూరిటీ కౌన్సిల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ పేరుతో కమిటీలను ఏర్పా టు చేశారు. ఆదివారం వరకు సదస్సు కొనసాగుతుంది.
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. విధాన రూపకర్తలుగా తయారుకావాలి. రాబోయే రోజుల్లో సవాళ్లను ఎదుర్కొని, సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత వారిదే. మలాలా స్ఫూర్తితో ముందుకు సాగాలి. పేదరికం, విద్య, పారిశుద్ధ్యం సమస్యగా మారాయి. వాటిని పరిష్కరించే దిశగా సూచనలు, సలహాలు ఉండాలి.
- నాదెండ్ల మనోహర్
ఎంతో విజ్ఞానం
మోడల్ యూఎన్ సద స్సులో సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నా. ఈ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ సదస్సు ద్వారా మాకు ఎంతో విజ్ఞానం లభిస్తోంది. వివిధ నగరాల విద్యార్థులతో పరిచయం ఏర్పడుతుంది. మొత్తం 250 మంది విద్యార్థులు దేశం నలుమూలల నుంచి వచ్చారు.
- సంతోష్ వల్లభనేని12వ తరగతి, ఓక్రిడ్జ్ స్కూల్
అందరి సమస్యలూ తెలుస్తాయి
ఈ సదస్సులో ఫైనా న్స్ అండ్ స్పాన్సర్షిప్ కమిటీకి డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నా. వివిధ దేశాలకు ప్రతినిధులుగా వచ్చిన వారి నుంచి సమస్యలు తెలుసుకున్నాం. వీటన్నింటితో ఒక నివేదిక రూపొందిస్తాం. ఇలాంటి సదస్సుల వల్ల ఆయా దేశాల్లో పరిస్థితులు అవగాహనకు వస్తాయి.
- జ్యోతి వల్లూరిపల్లి
12వ తరగతి, ఓక్రిడ్జ్ స్కూల్
ప్రపంచ దేశాలపై అవగాహన
ఇక్కడ ప్రపంచ దేశాల సమస్యలను చర్చిస్తారు. దీనివల్ల విద్యార్థుల్లో డిబేటిం గ్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో... అక్కడి సమస్యలేంటో తెలుస్తాయి. సమస్యకు పరిష్కారం ఎలా ఉండాలో కనుగొంటారు. ఇది వారి విద్యాభ్యాసానికి ఎంతో దోహదపడుతుంది.
- మొహిసినా
కార్యక్రమ సమన్వయకర్త, ఓక్రిడ్జ్ స్కూల్