House rental Increased
-
చుక్కలనంటుతున్న ‘అద్దెలు’,కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు
బ్రిటన్‌లో లివర్‌పూల్ శివార్లలోని నారిస్ గ్రీన్ ప్రాంతానికి చెందిన గాలింగేల్ రోడ్‌ను ఇప్పుడంతా ‘దెయ్యాలవీథి’ గా పిలుచు కుంటున్నారు. ఎందుకలా? అక్కడేమైనా క్షుద్రపూజల వంటివి జరుగుతున్నాయా? అతీంద్రియ శక్తుల కదలికలేమైనా ఉన్నాయా? అంటే, అలాంటివేమీ లేవు. మరి దెయ్యాలవీథిగా పేరు ఎందుకొచ్చిందనేగా మీ అనుమానం? లండన్ తర్వాత బ్రిటన్‌లో ఖరీదైన ప్రాంతాల్లో లివర్‌పూల్ ఒకటి. లివర్‌పూల్ నడిబొడ్డునే కాదు, శివారు ప్రాంతాల్లో కూడా ఇటీవల ఇళ్ల అద్దెలు చుక్కలనంటే స్థాయిలో పెరిగాయి. గాలింగేల్ రోడ్‌లోనూ ఇళ్ల అద్దెలు జనాల తాహతుకు మించి పెరగడం మొదలవడంతో, ఇంతకాలం ఇక్కడ ఉంటూ వచ్చిన వారిలో చాలామంది ఒక్కొక్కరుగా ఇళ్లు ఖాళీచేసి వేరేచోటుకు తరలి పోయారు. ఇంకా మిగిలిన ఒకటీ అరా కుటుంబాల వారు కూడా వీలైనంత త్వరలోనే ఇక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని వేరేచోటుకు తరలిపోయే ఆలోచనల్లో ఉన్నారు. దాదాపు తొంభై శాతానికి పైగా ఇళ్లు ఖాళీ కావడంతో ఈ వీథి వీథంతా కొన్ని నెలలుగా నిర్మానుష్యంగా మారింది. దీంతో స్థానికులు ఈ ప్రాంతాన్ని ‘ఘోస్ట్ స్ట్రీట్’గా పిలుచుకుంటున్నారు. ‘ఇంటి అద్దె ఒకేసారి 680 పౌండ్ల (రూ.65 వేలు) నుంచి 750 పౌండ్లకు (71 వేలు) పెరిగింది. ఈ అద్దె భరించడం మాకు శక్తికి మించిన పని. త్వరలోనే ఇల్లు ఖాళీచేసి వేరేచోటుకు వెళ్లిపోదామనుకుంటున్నాం. ఇక్కడ మిగిలిన ఒకటీ అరా కుటుంబాల వారు కూడా ఇతర ప్రాంతాల్లో ఇళ్ల కోసం వెదుకులాడుతున్నారు. తగిన ఇల్లు దొరికితే ఈ వీథిని ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఉన్న కాసిని కుటుంబాలు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే పూర్తిగా ఇది ‘ఘోస్ట్స్ట్రీట్’గానే మిగులుతుంది’ అని ఆండీ అనే ఈ ప్రాంతవాసి తెలిపారు. -
లగ్జరీగా ఇళ్ల అద్దెలు.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో లగ్జరీ ఇళ్ల అద్దెలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కోవిడ్ కలకలం నేపథ్యంలో వందలాది ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించడంతో.. భారీగా వేతనాలు అందుకుంటున్న ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాలకు చెందిన ఉన్నతోద్యోగులు, టీమ్‌లీడర్లు, సీఈఓలు, కార్పొరేట్లు లగ్జరీ ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. వీరిలో ఇప్పటికే చాలా మంది భారీగా అద్దెలు చెల్లించి విలాసవంతమైన ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో వెల్లడించింది. ఈప్రాంతంలో 2014తో పోలిస్తే ప్రస్తుతం అద్దెల విషయంలో సుమారు 26 శాతం మేర పెరుగుదల నమోదైందని తెలిపింది. ఇక లగ్జరీ ఇళ్ల సెగ్మెంట్లో భారీగా అద్దెలు వసూలు చేస్తున్న నగరాల్లో మన గ్రేటర్ హైదరాబాద్ తరవాత స్థానంలో నిలిచిన బెంగళూరులో 24 శాతం..ఆతరవాత నిలిచిన చెన్నై, కోల్‌కతా నగరాల్లో 19 శాతం అద్దెల్లో పెరుగుదల నమోదైనట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అద్దెల భూమ్‌కు కారణాలివే.. ► కోవిడ్ కలకలకం నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు పరిమితమవడం. ►ఇల్లునే ఆఫీసుగా మార్చుకునేందుకు పలువురు లగ్జరీ ఇళ్లను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తిచూపడంతోపాటు..ఇంట్లో సువిశాల ప్రాంగణాన్ని ఆఫీసు కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. ► నగరంలో ఐటీ కారిడార్ కాస్మొపాలిటన్ కల్చర్‌కు కేరాఫ్‌గా నిలవడంతోపాటు విద్య,వైద్య,మౌలికవసతులు అందుబాటులో ఉండడంతో చాలా మంది ఈప్రాంతంలో అద్దెకుండేందుకు ఇష్టపడడం. ► బహుళజాతి కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఐటీ కారిడార్ చిరునామాగా మారడం. సమీప భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు ఈప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశాలుండడం. ► పలు ఐటీ, బీపీఓ, కెపిఓ సంస్థలు తమ సంస్థలో పనిచేస్తున్న కీలక ఉద్యోగులకు లగ్జరీ ఇళ్లలో వసతి సదుపాయం ఏర్పాటుచేయడం. మెట్రోనగరం ప్రాంతం ఇళ్ల అద్దెల్లో పెరుగుదల శాతం హైదరాబాద్ ఐటీకారిడార్ 26 బెంగళూరు జేపినగర్ 24 చెన్నై కొట్టుపురం 19 కోల్‌కతా అలీపూర్ 19 -
చుక్కలనంటుతున్న ‘అద్దె’లు
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన సుబ్బయ్య భార్యా పిల్లలతో కలిసి ఉపాధి కోసం పట్టణానికి వచ్చాడు. ఇక్కడ నివాసం ఉండేం దుకు చిన్నపాటి గది కోసం వెతుకులాట ప్రారంభించగా శివారు ప్రాంతంలో రెండు గదుల ఇల్లు అద్దె కు దొరికింది. పోనీలే ఏదో ఒకటి దొరికిందా కదా అనుకుని ఊపిరిపీల్చుకునే లోపే ఇంటి యజమాని అద్దె రూ. 2500 అని చెప్పడంతో గుండెలు కిందకు జారాయి. చేసేదేమీ లేక పిల్లలు వీధిన పరుండబెట్టలేక యజ మాని అడిగిన మొత్తం చెల్లించాడు. ఇది ఒక్క సుబ్బయ్య పరిస్థి తే కాదు. విద్య, ఉపాధి తదితర రంగాల్లో కాస్త అభివృద్ధి చెం దేందుకు పట్టణానికి వలసలు వచ్చే ప్రతిఒక్కరూ ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉపాధి, విద్య కోసం వస్తున్న వలస జీవులకు అద్దె భారం తడిసిమోపెడవుతోంది. గ్రామీణ ప్రాంతా ల నుంచి పట్టణానికి వలసలు పెరగడం, నివాసగృహాలు తక్కువగా ఉండడంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. అంతేకాకుండా ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, గృహాలు తక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అనుకూలమైన ఇల్లు అద్దెకు దొరకాలంటే నెల రోజుల పాటు కాళ్లరిగేలా తిరుగుతున్నప్పటికీ చివరికి యజమానులు అడిగినంత అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణ ఇంటికి నెలకు రూ.2000. డబుల్ బెడ్రూమ్ రూ.3000. ఆకర్షణీయంగా ఉంటే రూ. 5వేల నుంచి రూ.8వేల వరకు డిమాండ్ ఉంది. అదే మున్సిపాలిటీలైన సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంప్రాంతాలతో పాటు, మండల కేంద్రాలైన చీపురుపల్లి, గజపతినగరం, ఎస్. కోట, నెల్లిమర్ల, రామభద్రపురం తదితర ప్రాంతా ల్లో రూ.1500 నుంచి రూ. 3000 వేలపై మాటే. ఇక్కడ కాస్త సౌకర్యాలు ఉన్న ఇల్లు అయితే రూ.5 వేలు వరకు పలుకుతోంది. ఇదిలా ఉం డగా పట్టణానికి వలసలు వస్తున్న వారి సంఖ్య ఎక్కు వ కావడం, సరిపడా ఇళ్లు లేకపోవడంతో అద్దెలు భారీ గా పెరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో రెండేళ్ల కిందట రూ.1000 నుంచి రూ.2000 వరకు ఉన్న ఇంటి అద్దె ప్రస్తుతం రూ. 4000 వేలు పలుకుతోం ది. సింగ్ బెడ్రూమ్ ఇంటి అద్దె రూ. నాలుగు వేల వరకు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక డబుల్, త్రిబుల్ బెడ్రూం ఇళ్ల అద్దెలైతే సామాన్యులకు అందనంత ఎత్తులో కూర్చున్నాయి. అద్దెలు ఒక్కసారిగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్ని రంగాల్లో విజ యనగరం పట్టణం అభివృద్ధి చెందడంతో అధిక శాతం మంది పట్టణంలో నివసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెరిగి న వ్యాపార లావాదేవీలు, విస్తృతమైన విద్యా సంస్థల వల్ల పట్టణ జీవనం తప్పనిసర ని భావిస్తున్నారు. ఆర్థిక స్థోమత కలిగి ఉన్నవారు పిల్లలను పట్టణంలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో జనాలు పెరుగుతున్న స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పెరగకపోవడంతో అద్దె భారం పెంచేస్తున్నారు. శివారు కాలనీల్లో పెరుగుతున్న డిమాండ్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో అద్దె భారం తట్టుకోలేక శివారు కాలనీల్లో నివసించేందుకు మధ్య తరగతి ప్రజలు ఆసక్తి చూపుతుంటే అక్కడ కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఎందుకూ పనికిరాని గోదాములను ఇప్పుడు ఇళ్ల రూపంలోకి మార్చేసి అద్దెలకు ఇచ్చేస్తున్నారు. చిన్న పాటి గదులతో కూడిన ఇళ్లు కూడా అద్దెకు దొరకాలంటే కష్టమే. పట్టణంలోని బ్యాచిలర్స్‌కు ఇళ్లు అద్దెకు దొరకాలంటే గగనమైపోయింది. వి విధ కోర్సులలో విద్యనభ్యసించేందుకు గ్రామీణ ప్రాతాల నుం చి, ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి కష్టాలు తప్పడం లేదు.