చుక్కలనంటుతున్న ‘అద్దె’లు
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన సుబ్బయ్య భార్యా పిల్లలతో కలిసి ఉపాధి కోసం పట్టణానికి వచ్చాడు. ఇక్కడ నివాసం ఉండేం దుకు చిన్నపాటి గది కోసం వెతుకులాట ప్రారంభించగా శివారు ప్రాంతంలో రెండు గదుల ఇల్లు అద్దె కు దొరికింది. పోనీలే ఏదో ఒకటి దొరికిందా కదా అనుకుని ఊపిరిపీల్చుకునే లోపే ఇంటి యజమాని అద్దె రూ. 2500 అని చెప్పడంతో గుండెలు కిందకు జారాయి. చేసేదేమీ లేక పిల్లలు వీధిన పరుండబెట్టలేక యజ మాని అడిగిన మొత్తం చెల్లించాడు. ఇది ఒక్క సుబ్బయ్య పరిస్థి తే కాదు. విద్య, ఉపాధి తదితర రంగాల్లో కాస్త అభివృద్ధి చెం దేందుకు పట్టణానికి వలసలు వచ్చే ప్రతిఒక్కరూ ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉపాధి, విద్య కోసం వస్తున్న వలస జీవులకు అద్దె భారం తడిసిమోపెడవుతోంది. గ్రామీణ ప్రాంతా ల నుంచి పట్టణానికి వలసలు పెరగడం, నివాసగృహాలు తక్కువగా ఉండడంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది.
అంతేకాకుండా ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, గృహాలు తక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అనుకూలమైన ఇల్లు అద్దెకు దొరకాలంటే నెల రోజుల పాటు కాళ్లరిగేలా తిరుగుతున్నప్పటికీ చివరికి యజమానులు అడిగినంత అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణ ఇంటికి నెలకు రూ.2000. డబుల్ బెడ్‌రూమ్ రూ.3000. ఆకర్షణీయంగా ఉంటే రూ. 5వేల నుంచి రూ.8వేల వరకు డిమాండ్ ఉంది. అదే మున్సిపాలిటీలైన సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంప్రాంతాలతో పాటు, మండల కేంద్రాలైన చీపురుపల్లి, గజపతినగరం, ఎస్. కోట, నెల్లిమర్ల, రామభద్రపురం తదితర ప్రాంతా ల్లో రూ.1500 నుంచి రూ. 3000 వేలపై మాటే. ఇక్కడ కాస్త సౌకర్యాలు ఉన్న ఇల్లు అయితే రూ.5 వేలు వరకు పలుకుతోంది. ఇదిలా ఉం డగా పట్టణానికి వలసలు వస్తున్న వారి సంఖ్య ఎక్కు వ కావడం, సరిపడా ఇళ్లు లేకపోవడంతో అద్దెలు భారీ గా పెరిగిపోతున్నాయి.
జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో రెండేళ్ల కిందట రూ.1000 నుంచి రూ.2000 వరకు ఉన్న ఇంటి అద్దె ప్రస్తుతం రూ. 4000 వేలు పలుకుతోం ది. సింగ్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె రూ. నాలుగు వేల వరకు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక డబుల్, త్రిబుల్ బెడ్‌రూం ఇళ్ల అద్దెలైతే సామాన్యులకు అందనంత ఎత్తులో కూర్చున్నాయి. అద్దెలు ఒక్కసారిగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్ని రంగాల్లో విజ యనగరం పట్టణం అభివృద్ధి చెందడంతో అధిక శాతం మంది పట్టణంలో నివసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెరిగి న వ్యాపార లావాదేవీలు, విస్తృతమైన విద్యా సంస్థల వల్ల పట్టణ జీవనం తప్పనిసర ని భావిస్తున్నారు. ఆర్థిక స్థోమత కలిగి ఉన్నవారు పిల్లలను పట్టణంలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో జనాలు పెరుగుతున్న స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పెరగకపోవడంతో అద్దె భారం పెంచేస్తున్నారు.
శివారు కాలనీల్లో పెరుగుతున్న డిమాండ్
పట్టణంలోని ప్రధాన వీధుల్లో అద్దె భారం తట్టుకోలేక శివారు కాలనీల్లో నివసించేందుకు మధ్య తరగతి ప్రజలు ఆసక్తి చూపుతుంటే అక్కడ కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఎందుకూ పనికిరాని గోదాములను ఇప్పుడు ఇళ్ల రూపంలోకి మార్చేసి అద్దెలకు ఇచ్చేస్తున్నారు. చిన్న పాటి గదులతో కూడిన ఇళ్లు కూడా అద్దెకు దొరకాలంటే కష్టమే. పట్టణంలోని బ్యాచిలర్స్‌కు ఇళ్లు అద్దెకు దొరకాలంటే గగనమైపోయింది. వి విధ కోర్సులలో విద్యనభ్యసించేందుకు గ్రామీణ ప్రాతాల నుం చి, ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి కష్టాలు తప్పడం లేదు.