షాపింగ్ మాల్లో కాల్పుల కలకలం
హుస్టన్: అమెరికాలోని మళ్లీ కాల్పుల మోత మోగింది. హుస్టన్‌లోని ఓ షాపింగ్ మాల్లో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల్లో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానిత సాయుధుడిని హతమార్చారు.
ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో నగరంలో ఎమర్జెన్సీ అలర్ట్ విధించారు. హుస్టన్ వాయవ్య నగరంలో ఓ స్ట్రిప్ షాపింగ్ మాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? ఎవరైనా మృతిచెందారా? వంటి విషయాలు ఇంకా తెలియరాలేదు. కానీ పలువురిని సమీపంలోని ఆస్పత్రుల తరలించినట్టు హుస్టన్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. కాల్పుల ఘటన పరిసర ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగరవాసులకు సూచించారు. అంతేకాకుండా కాల్పులు జరిగిన ప్రదేశంలో బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు.