విత్తన గుట్టు రట్టు
గూడూరు: సబ్సిడీ విత్తనాలను అధిక ధరకు విక్రరుుంచిన విషయం మండల పరిధిలోని ఆర్. ఖానాపురంలో గ్రామసభలో దుమారం రేపింది. విషయంపై సభ సాక్షిగా ఎంపీపీ, ఏఓ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని ఆర్.ఖానాపురంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఈశ్వరమ్మ, మండల వ్యవసాయాధికారిణి ఎ.మాధురి మధ్య తీవ్ర గొడవ జరగడంతో వ్యవహారం బయటకొచ్చింది.
ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో సభలో ఏమి జరుగుతుందో కొద్దిసేపు అర్థం కాకుండాపోరుుంది. ఎంపీపీ సభలో ప్రసంగిస్తూ శనగ విత్తనాలను ఏ రేటుకు కొనుగోలు చేశారని రైతులను ప్రశ్నించగా పక్కనే ఉన్న ఏఓ ఒకసారిగా లేచి ఎంపీపీతో వాదనకు దిగారు. ఓ దశలో ఇద్దరూ తిట్ల పురాణం అందుకున్నారు. నోడల్ అధికారి మధుసూదన్ ఇరువురికి సర్ధిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
మండలానికి నెల క్రితం 187 క్వింటాళ్ల సబ్సిడీ శనగ విత్తనాలు మంజూరయ్యూరుు. అరుుతే వ్యవసాయశాఖాధికారులు విత్తనాలను రైతులకు నేరుగా ఇవ్వకుండా ఎంపీపీ భర్త మహేశ్వరరెడ్డికి అనధికారికంగా కేటాయించారు. వీటిని గుడిపాడు, గూడూరు, మునుగాల గ్రామాల్లో ఆదర్శ రైతుల ఆధ్వర్యంలో డంప్ చేశారు. మహేశ్వరరెడ్డి సూచించిన రైతులకు మాత్రమే వ్యవసాయశాఖ సిబ్బంది చిత్తు కాగితాలపై చీటీలు రాసిస్తూ విత్తనాలు అందించారు.
క్వింటా రూ. 1720 ప్రకారం విక్రయించాల్సి ఉండగా రూ. 2600 చొప్పున వసూలు చేశారు. విషయంపై మహేశ్వరెడ్డి వారం రోజులుగా ఏఓతో వాదనకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏఓ శుక్రవారం మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ను కలిసి మహేశ్వర్‌రెడ్డిపై పంచారుుతీ పెట్టించారు. మరోవైపు ఎంపీపీ వర్గీయులు కూడా ఏఓ తీరును జేడీఏ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై జేడీఏ విచారణకు నిర్ణరుుంచినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం గ్రామసభలో ఎంపీపీ, ఏఓ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.