HR Management
-
ఎయిర్ ఇండియాలో కొత్త పంచాయతీ...
-
షాకింగ్ ఘటన: చనిపోయిన ఉద్యోగికి పదోన్నత కల్పిస్తూ పోస్టింగ్!
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఓ ఇంజనీర్‌కు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు డబుల్ శాలరీ ఇచ్చిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే...తాజాగా చనిపోయిన మరో ఇంజనీర్‌కు ఏకంగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్ కూడా ఇచ్చిన ఉదంతం వెలుగు చూసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హెచ్ఆర్ విభాగంలోని అధికారుల తప్పిదాలకు సంస్థ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో అభాసుపాలవుతోంది. రెండేళ్ల క్రితమే చనిపోయిన మల్లయ్య.. పి.మల్లయ్య (ఐడీ నంబర్ 1077222) మొదట్లో మెట్రోజోన్ పరిధిలోని డీఈ కేబుల్ ఆఫీసులో సబ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అటు నుంచి బంజారాహిల్స్‌కు సబ్‌ఇంజనీర్‌గా బదిలీపై వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సుమారు రెండేళ్ల క్రితమే మృతి చెందారు. డిస్కం ఉన్నతాధికారులు చనిపోయిన మల్లయ్య స్థానంలో కారుణ్య నియామకం కింద ఆయన కుమార్తెకు సబ్ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం ఆమె సైబర్‌సిటీ సర్కిల్ ఆఫీసులోని కమర్షియల్ సబ్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. రెండు రోజుల క్రితం పదోన్నతి రెండు రోజుల క్రితం 49 మంది సబ్ ఇంజనీర్లకు డిస్కం ఏఈలుగా పదోన్నతులు కల్పించింది. వీరిలో ఆ మేరకు పదోన్నతులు పొందిన వారి పేర్లతో సహా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిస్కం జారీ చేసిన ఈ జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటమే కాకుండా ఆయనకు సబ్ ఇంజనీర్ నుంచి ఏఈగా పదోన్నతి కల్పించారు. ఏకంగా ఆయనకు వికారాబాద్‌లో పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఏఈల జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటాన్ని చూసి తోటి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. అదేమిటని సంబంధిత సెక్షన్ అధికారులను, హెచ్ఆర్ డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో చేసిన తప్పిదాన్ని ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. (చదవండి: ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!) -
హ్యూసిస్ ఆటోమేషన్ బాట
- వ్యవస్థాపకులు జి.ఆర్.రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్ఆర్ మేనేజ్మెంట్ సేవలందిస్తున్న హ్యూసిస్ ఆటోమేషన్ బాట పట్టింది. హ్యూమన్ రిసోర్సెస్(హెచ్ఆర్) రంగంలో రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా క్లౌడ్ ఆధారిత టెక్నాలజీకి అనుసంధానం చేసింది. ఇందుకోసం పలు సేవలందిస్తున్న కంపెనీలతో చేతులు కలిపింది. పేరోల్, బెనిఫిట్స్, హైరింగ్, ట్యాక్సెస్ ఇలా 150 రకాల అంశాలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చామని హ్యూసిస్ వ్యవస్థాపకులు జి.ఆర్.రెడ్డి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. తాము సేవలందిస్తున్న కంపెనీలకు మరింత మెరుగ్గా వన్ స్టాప్ సొల్యూషన్స్‌ను ఈ టెక్నాలజీ వీలు కల్పిస్తుందని చెప్పారు. ‘ఐఎస్బీ, ఆస్ట్రాజెనికా వంటి 400 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హెచ్ఆర్ విభాగంలేని కంపెనీలకు హెచ్ఆర్ ఫంక్షన్ మేనేజ్మెంట్ సేవలను థర్డ్ పార్టీగా అందిస్తున్నాం. ఏడాదిలో 100 నగరాలకు చేరుకోవడం ద్వారా క్లయింట్లకు చెందిన 5 లక్షల మంది ఉద్యోగులకు సేవలను అందించాలన్నది లక్ష్యం’ అని తెలిపారు.