Hrishikesh Kanitkar
-
'ఇప్పుడే సరైనోడి చేతుల్లోకి వెళ్లాం'.. టీమిండియా కెప్టెన్ కౌంటర్
భారత మహిళల జట్టు మాజీ హెడ్‌కోచ్ రమేశ్ పవార్‌పై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 6న బీసీసీఐ రమేశ్ పొవార్‌ను భారత మహిళల జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్ దశలోనే వెనుదిరగడం పొవార్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడానికి ప్రధాన కారణమయింది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్ కనిత్కర్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ రమేశ్ పొవార్‌ను ఎన్సీఏకు బదిలీ చేసింది. ఇకపై ఎన్సీఏ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌తో పొవార్ కలిసి పనిచేస్తాడని బీసీసీఐ తెలిపింది. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం రమేశ్ పొవార్‌పై పరోక్షంగా కౌంటర్ వేసింది. ఇండియా, ఆస్ట్రేలియా వుమెన్స్ ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మీడియాతో మాట్లాడింది. ఇప్పుడు మేం సరైన వ్యక్తి చేతుల్లో ఉన్నాం అంటూ తెలిపింది. అయితే పొవార్‌ను ఉద్దేశించే హర్మన్ ప్రీత్ ఇలా వ్యాఖ్యలు చేసిందంటూ కొంతమంది పేర్కొన్నారు. అయితే పొవార్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడం వెనుక హర్మన్‌ప్రీత్ హస్తం ఉందని హిందుస్థాన్ టైమ్స్ ఆరోపణలు చేసింది. పొవార్‌ను కోచ్ పదవి నుంచి తొలగించాలంటూ బీసీసీఐ సెక్రటరీ జై షాకు స్వయంగా లేఖ రాసినట్లు తెలిసింది. అయితే టీమిండియా మహిళా జట్టుకు పొవార్‌పై ముందు నుంచి మంచి అభిప్రాయం లేదు. ఇంతకముందు 2018 టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న మిథాలీరాజ్‌ను పొవార్ పక్కనబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మిథాలీ రిటైర్మెంట్ తర్వాత తన పుస్తకంలోనూ రమేశ్ పొవార్‌తో ఉన్న విబేధాలను బయటపెట్టింది. హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చాలాసార్లు వివాదాల్లో నిలిచాడు. అందుకే హర్మన్‌ప్రీత్ స్వయంగ రంగంలోకి దిగి బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం. ఇక కొత్త హెడ్‌కోచ్ ఎవరనే దానిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం హెడ్‌కోచ్ లేకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది. అయితే 2021లో హృషికేష్ కనిత్కర్ హెడ్‌కోచ్ పదవికి అప్లై చేసినప్పటికి అతనికి అవకాశం రాలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు మాత్రం హృషికేష్ కనిత్కర్‌కు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మహిళల జట్టుకు పనిచేసే అవకాశం లభించింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ -
భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్
భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్‌ను బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 9న ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టీ20 నుంచి భారత బ్యాటింగ్ కోచ్‌గా కనిత్కర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా హృషికేశ్ కనిత్కర్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అదే విధంగా భారత మహిళల జట్టు మాజీ హెడ్ కోచ్ రమేష్ పొవార్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికైన అనంతరం కనిత్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. "భారత సీనియర్ మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. భారత జట్టులో కలిసి పనిచేయడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. మా జట్టులో సీనియర్ క్రికెటర్లతో పాటు అద్భుతమైన యువ క్రికెటర్లు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో మాకు పెద్ద సవాళ్లు ఎదురు కానున్నాయి. బ్యాటింగ్ కోచ్‌గా నా వంతు బాధ్యతలు నిర్వహించి జట్టును ముందుకు నడిపిస్తాను" అని కనిత్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్ 🚨 NEWS 🚨: Hrishikesh Kanitkar appointed as Batting Coach - Team India (Senior Women), Ramesh Powar to join NCA More Details 🔽https://t.co/u3Agagamdd — BCCI (@BCCI) December 6, 2022 చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ షాక్! -
క్రికెట్‌కు కనిత్కర్ వీడ్కోలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై 1998లో ఉత్కంఠ పోరులో చివరి బంతిని బౌండరీకి పంపి భారత్‌ను గెలిపించిన హృషికేశ్ కనిత్కర్... అప్పట్లో అభిమానుల దృష్టిలో హీరోగా నిలిచాడు. అయితే భారత్ తరఫున కేవలం మూడేళ్లు మాత్రమే ఆడిన ఈ బ్యాట్స్‌మన్ ఇంతకాలానికి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున తను రెండు టెస్టులతో పాటు 34 వన్డేలు ఆడాడు. రంజీల్లో చివరిసారిగా 2013లో రాజస్తాన్ తరఫున ఆడాడు. రంజీల్లో ఎనిమిది వేలకు పైగా పరుగులు చేసిన ముగ్గురు ఆటగాళ్లలో తనూ ఒకడు. అలాగే 28 శతకాలతో పాటు రంజీ చరిత్రలో ఎలైట్, ప్లేట్ లీగ్ టైటిల్స్ నెగ్గిన ఏకైక కెప్టెన్‌గానూ నిలిచాడు. బ్యాటింగ్ చేయడంలో సమస్య లేకున్నా ఫీల్డింగ్‌లో చురుగ్గా కదల్లేకపోతున్నానని రిటైర్మెంట్ వెనుక కారణాన్ని 40 ఏళ్ల కనిత్కర్ తెలిపాడు. ఓవరాల్‌గా తను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ జట్లకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం కోచింగ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్న ఈ మహారాష్ట్ర ఆటగాడు ఇప్పటికే బీసీసీఐ అండర్-19 క్రికెటర్లకు సంబంధించి ఈస్ట్ జోన్ శిబిరాన్ని నిర్వహించాడు.